వామ్మో.. వార్నర్ మళ్ళీ షాక్ ఇచ్చాడుగా!

ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు సొంత దేశంలో కంటే ఇండియాలోనే ఎక్కువ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాధించుకున్నాడు. ముఖ్యంగా సన్ రైజర్స్ ద్వారా అతను తెలుగు జనాలకు మరింత దగ్గరయ్యాడు. అయితే వార్నర్ సోషల్ మీడియాలో చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మన స్టార్ హీరోల డైలాగ్స్ ను ఇమిటేట్ చేస్తూ చాలాసార్లు రీల్స చేశాడు. ఇక ఫెస్ మార్ఫింగ్ వీడియోలతో కూడా షాక్ ఇచ్చాడు. పుష్ప డైలాగ్ తో కూడా వార్నర్ బాగా క్రేజ్ అందుకున్నాడు. అయితే రష్మిక మందన్న భీష్మ సినిమాలో ట్విన్కుల్ ట్విన్కుల్ లిటిల్ స్టార్ పాటతో కూడా వార్నర్ షాక్ ఇచ్చాడు. ఫేస్ మార్ఫింగ్ చేసి వీడియోతో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇక నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తూ ఉంటే వార్నర్ కూడా వారికి సరదాగా సమాధానాలు ఇస్తున్నాడు.