ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి చేసినంత మాత్రాన వసూళ్లు రావనే నిజాన్ని గుర్తించి మొదటి వారంలోనే సైడైపోవడం అనూహ్యం. ఎంత పెద్ద ఫ్లాప్ అయినా సరే కనీసం పది రోజులు పబ్లిసిటీ చేసే ట్రెండ్ లో ఫంకీ బాక్సాఫిస్ తత్వాన్ని అర్థం చేసుకుని మౌన వ్రతం పాటించడం మంచిదే.
దీంతో విశ్వక్ సేన్ గేర్ మార్చేశాడు. తన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న కల్ట్ ప్రచారాన్ని టీజర్ లాంచ్ తో మొదలుపెట్టబోతున్నాడు. టాలీవుడ్ మొదటి స్లాషర్ మూవీగా దీని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలే బయటికి వినిపిస్తున్నాయి.
దాని ప్రకారం కల్ట్ లో భీభత్సమైన వయొలెన్స్ ఉంటుంది. ఇప్పటిదాకా తెలుగు తెర చూడనంత రక్తపాతం చూపిస్తారని అంటున్నారు. మాములుగా హాలీవుడ్ లో ఇలాంటి సిరీస్, మూవీస్ లెక్కలేనన్ని వచ్చాయి. మొహం తిప్పుకునేంత దారుణంగా వాటిలో హత్యలు, రక్తపాతాలు ఉంటాయి. అయినా సరే జనం ఎగబడి చూస్తారు.
కల్ట్ కూడా అదే క్యాటగిరీలో రూపొందుతోందని సమాచారం. అదే నిజమైతే సెన్సార్ దగ్గర క్లియరెన్స్ తెచ్చుకోవడం ఆషామాషిగా ఉండదు. కేవలం టైటిల్స్ కే ఏ సర్టిఫికెట్ ఇస్తున్న రోజులు ఇవి. ఇదిలా ఉండగా కల్ట్ తర్వాత విశ్వక్ తర్వాత సినిమా లెగసి కూడా సీరియస్ బ్యాక్ డ్రాప్ లోనే రూపొందుతోంది.
రాజకీయ నేపథ్యంలో చాలా డీప్ గా పొలిటికల్ ఇష్యూస్ ని లెగసిలో చూపించబోతున్నారని సమాచారం. ఆల్రెడీ టీజర్ లో హీరో పాత్ర తండ్రి సమాధి మీద మూత్ర విసర్జన చేయడం అభిమానులను షాక్ కి గురి చేసింది. శాంపిలే ఇలా ఉంటే ఇక మెయిన్ మూవీ ఎలా ఉంటుందో చెప్పాలా.
చూస్తుంటే కల్ట్, లెగసి ద్వారా విశ్వక్ సేన్ పిల్లలకు, కుటుంబాలకు దూరంగా పూర్తిగా మాస్ ని టార్గెట్ చేసుకున్న వైనం స్పష్టమవుతోంది. నెక్స్ట్ లైనప్ లో ఉన్న ఈ నగరానికి ఏమైంది 2 తిరిగి ఎంటర్ టైనరే అయినప్పటికీ అందులో విశ్వక్ ఒక్కడే మెయిన్ లీడ్ కాదు కనుక ప్రస్తుతానికి మూవీ లవర్స్ దృష్టి కల్ట్, లెగసీల మీద ఎక్కువగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates