అల్లు అర్జున్-సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం పుష్పలో ఓ కీలక పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరగడం.. పైగా కరోనా వచ్చి పెద్ద బ్రేక్ వేయడంతో సేతుపతికి తలనొప్పి మొదలైంది. అతడికి తమిళంలో ఇబ్బడి ముబ్బడిగా సినిమాలున్నాయి. రెండంకెల సంఖ్యలో కమిట్మెంట్లు ఇచ్చాడట. కరోనా ప్రభావం తగ్గాక ఆ సినిమాలకు డేట్లు సర్దుబాటు చేయడమే తలకు మించిన భారంగా ఉంది. ఇక బల్క్ డేట్లు అవసరమైన పుష్ప సినిమాకు ఎలా కాల్ షీట్లు కేటాయించాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అతను పుష్ప నుంచి తప్పుకున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
కానీ ఈ విషయంలో స్పష్టత లేకపోయింది. అధికార ప్రకటన ఏదీ లేదు. ఐతే ఇప్పుడు స్వయంగా విజయ్ సేతుపతే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. ఓ తమిళ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను పుష్ప సినిమా నుంచి తప్పుకున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమా కోసం తనను అడగడం, పాత్ర నచ్చి అంగీకారం తెలపడం నిజమే అని.. కానీ ఇప్పుడు డేట్ల సమస్య తలెత్తడంతో ఈ చిత్రం నుంచి తప్పుకోక తప్పలేదని అతను తెలిపాడు. ఇప్పుడు హామీ ఇచ్చి.. తీరా షూటింగ్ మొదలయ్యే సమయానికి డేట్లు సర్దుబాటు చేయలేకపోతే ఇబ్బందని.. కాబట్టి తప్పుడు హామీలు ఇవ్వలేకే ఈ సినిమా నుంచి తప్పుకున్నానని విజయ్ స్పష్టం చేశాడు. విజయ్ ఈ విషయంలో ముందే సంకేతాలు ఇవ్వడంతో ఆ పాత్రలో బాబీ సింహా లేదా అరవింద్ స్వామిని నటింపజేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on July 14, 2020 1:03 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…