టాలీవుడ్లో ప్రభాస్ పెళ్లి ఒకప్పుడు హాట్ టాపిక్. ఇది ఎంతకీ తెగే వ్యవహారంలా కనిపించకపోవడంతో ఈ చర్చను పక్కన పెట్టేశారు జనం. ప్రభాస్ పెళ్లి చేయాలని ఎంతో ఆశపడ్డ కృష్ణంరాజు ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. మరి ప్రభాస్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియట్లేదు. తమిళ సినీ పరిశ్రమలో విశాల్ పెళ్లి వ్యవహారం కూడా ఇలాగే తయారైంది.
ఒకప్పుడు వరలక్ష్మి శరత్‌కుమార్‌తో డీప్ లవ్‌లో ఉన్నట్లుగా కనిపించిన విశాల్.. ఆమెను పెళ్లి చేసుకోవడమే తరువాయి అన్నారు. కానీ వాళ్లిద్దరూ తర్వాత విడిపోయారు. ఆపై అనీషా అనే హైదరాబాద్ అమ్మాయితో విశాల్‌కు నిశ్చితార్థం జరిగి రద్దవడం తెలిసిందే. ఆ తర్వాత విశాల్ పెళ్లి గురించి పెద్దగా చర్చ లేదు. కానీ ఈ మధ్య విశాల్ తనే కల్పించుకుని తన పెళ్లి గురించి మాట్లాడుతుండడం విశేషం. నడిగర్ సంఘం భవన నిర్మాణ పనులు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని పాత పాటే పాడాడు.
దాంతో పాటుగా త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేస్తానని చెప్పాడు విశాల్. కాగా తన కొత్త చిత్రం ‘లాఠీ’కి సంబంధించి హైదరాబాద్‌లో ఒక ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న విశాల్‌కు యాంకర్ నుంచి పెళ్లి సంబంధిత ప్రశ్నే ఎదురైంది. మీరు అభినయ అనే అమ్మాయిని పెళ్లాడుతున్నారట నిజమేనా అని విశాల్‌ను ఆమె ప్రశ్నించడం విశేషం. దీనికి విశాల్ బదులిస్తూ.. ఎప్పట్నుంచో చెబుతున్నట్లే తాను నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని.. అందరికీ త్వరలోనే తన పెళ్లి గురించి క్లారిటీ ఇస్తానని చెప్పాడు.
సినిమా ఈవెంట్లో యాంకర్ ఇలా ప్రశ్నించింది అంటే.. ఇదంతా ముందుగా ప్లాన్ చేసుకున్న విషయం అనిపిస్తోంది. ఇప్పుడిక ఈ అభినయ గురించి అందరూ తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. నాడోడిగల్ (తెలుగులో శంభో శివ శంభో) చిత్రంతో నటిగా పరిచయం అయిన అభినయ.. తెలుగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె మూగ అమ్మాయి కావడం విశేషం. మరి నిజంగా విశాల్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on November 14, 2022 1:15 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…