అదేంటో మైత్రి మూవీ మేకర్స్ సినిమాలకే లీకుల బెడద ఎక్కువగా ఉంటోంది. తాజాగా ఈ లిస్టులో వీరసింహారెడ్డి మొదటి స్థానంలో ఉంది. ఆ మధ్య కర్నూలు జిల్లాలో టైటిల్ సాంగ్ చిత్రీకరించినప్పుడు దాని తాలూకు చిన్న వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది. టీమ్ అలెర్ట్ అయిపోయి డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం నడిపింది కానీ అప్పటికీ దాని రీచ్ ఎక్కడికో వెళ్ళింది.
తాజాగా అనంతపురం జిల్లా పెనుగొండలో జరుగుతున్న చిత్రీకరణ సైతం దీని బారిన పడక తప్పలేదు. విలన్ దునియా విజయ్ మీద షూట్ చేసిన కొన్ని సీన్లు బయటికి రావడం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. అందులో ఫ్లాష్ బ్యాక్ గెటప్ లో ప్రతాప్ రెడ్డిగా నటిస్తున్న విజయ్ తాలూకు సన్నివేశాలున్నాయి. తుపాకీలతో జరిపే ఓ పందెంలో పాల్గొనే దృశ్యం కూడా ఉంది. ట్విట్టర్ లో చూస్తే ఇవి ఎక్కువ కన్నడ ఫ్యాన్స్ నుంచి బయటికి వస్తున్నాయి.
షూటింగ్ జరుగుతున్న ప్రాంతం కర్ణాటక బోర్డర్ కు దగ్గర కావడంతో అభిమానులు తండోపతండాలుగా వెళ్ళిపోయి తమ సెల్ ఫోన్ కెమెరాలను పని చెబుతున్నారు. అవుట్ డోర్ అందులోనూ గ్రామీణ ప్రాంతం కావడంతో వీటిని కట్టడి చేయడం యూనిట్ కి కష్టసాధ్యంగా మారింది. దాంతో ఇప్పటికిప్పుడు వీటిని ఎవరూ ఆపలేని పరిస్థితి నెలకొంది.
వీటి సంగతెలా ఉన్నా అఫీషియల్ కాకపోయినా ఇవన్నీ వీరసింహారెడ్డి మీద అంచనాలు పెంచేలానే ఉన్నాయి.
పవర్ ఫుల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలకృష్ణ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో టీజరో ట్రైలరో రిలీజ్ అయితే క్లారిటీ వస్తుంది. సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో పోటీ పడబోతున్న వీరసింహారెడ్డి జనవరి 12 రిలీజ్ లాక్ చేసుకుందని ఇన్ సైడ్ టాక్. అధికారిక ప్రకటన ఇప్పుడే జరగకపోవచ్చు. వీరయ్య డేట్ ని లాక్ చేశాక రెండింటిని ఎప్పుడు రివీల్ చేయాలన్నది డిసైడ్ చేస్తారు. వారసుడు కూడా వెయిటింగ్ లోనే ఉంది.
This post was last modified on November 13, 2022 3:33 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…