Movie News

వకాండ కలెక్షన్స్ భేష్.. మరి టాకేంటి!

ఈ మధ్య హాలీవుడ్ సినిమాలకు మన దేశంలోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. మొన్న రిలీజైన బ్లాంక్ పాంథర్ వకాండ ఫరెవర్ కు హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో కటవుట్ పెట్టి, బాణాసంచా కాల్చి, హంగామా చేస్తే ఆ హడావిడిని ఇంగ్లీష్ ఛానల్స్ సైతం కవరేజ్ ఇవ్వడం విశేషం. అంతగా మనకు సూపర్ హీరోస్ ఫీవర్ పాకిపోతోంది. ఇండియాలోనూ సెన్సేషనల్ ఓపెనింగ్ అందుకున్న ఈ నల్ల వజ్రపు విజువల్ వండర్ మొదటి రోజు 18 కోట్ల 70 లక్షల దాకా గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ సమాచారం.

గత కొన్నేళ్లలో కొందరు తలలు పండిన మీడియం రేంజ్ బాలీవుడ్ స్టార్లకు సైతం సాధ్యం కానీ ఫిగర్ ఇది. దీని బట్టి బ్లాంక్ పాంథర్ మీద క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ లో నటించిన చాడ్విక్ బ్రోస్మన్ ఈ సీక్వెల్ తీయడానికి ముందే చనిపోవడంతో వకాండ మీద అభిమానులు ఎమోషనల్ కనెక్షన్ పెంచుకున్నారు. తనకు నివాళిగా టీమ్ ఇందులో చాలా భావోద్వేగాలను జోడించింది.

విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ అద్భుతంగా ఆవిష్కృతమైన ఈ రెండో భాగంలో నిడివి ఎక్కువవ్వడం టాక్ మీద ప్రభావం చూపిస్తోంది. భావోద్వేగాలను బలంగా చూపించే క్రమంలో ల్యాగ్ కి చోటివ్వడంతో బ్రోస్మన్ వీరాభిమానులకు ఓకే అనిపిస్తుంది కానీ కామన్ ఆడియన్స్ కి మాత్రమే కొంత ఇబ్బందే. వకాండ రాజు చనిపోతే అక్కడ దొరికే అరుదైన వైబ్రేనియంని కొల్లగొట్టేందుకు ఇతర దేశాలు ప్లాన్లు వేస్తాయి.

వాళ్ళను ఎదురుకుంటూ తమ దేశ సంపదను కాపాడుకునే క్రమంలో ఎదురయ్యే సంఘటనలు, శత్రువులు సృష్టించే విధ్వంసాలు, కొత్త బ్లాంక్ పాంథర్ గా ఎవరు అవతరించారనే ట్విస్టులు ఇలా ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ బొనాంజా గట్టిగానే దట్టించారు. కాకపోతే కొంత ఓపిగ్గా చూస్తే నచ్చేస్తుంది. మొన్న శుక్రవారం రిలీజైన కొత్త సినిమాల్లో తెలుగు రాష్ట్రాల్లో దీన్ని తాకిడిని తట్టుకుని నిలబడింది ఒక్క యశోద మాత్రమే. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో రెండు పోటాపోటీగా ఉన్నాయి.

This post was last modified on November 13, 2022 12:26 pm

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

20 minutes ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

2 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

3 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

3 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

5 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

7 hours ago