పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగ పున:ప్రవేశం ఖరారవ్వగానే.. స్వల్ప వ్యవధిలో మూడు సినిమాలు అంగీకరించాడు. అందులో ముందుగా ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ను మొదలుపెట్టాడు. ఇది చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దీని తర్వాత క్రిష్ సినిమాను కూడా మొదలుపెట్టి కొంత మేర షూటింగ్ చేశాడు. ఈ రెండూ పూర్తి చేసి హరీష్ శంకర్-మైత్రీ మూవీ మేకర్స్ సినిమా మొదలుపెట్టాలన్నది ప్రణాళిక.
అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికే ‘వకీల్ సాబ్’ విడుదలయ్యేది. క్రిష్ సినిమా కూడా పూర్తి కావచ్చేది. ఈ ఏడాది చివర్లో హరీష్ శంకర్ సినిమా కూడా మొదలయ్యేది. కానీ కరోనా వచ్చి అన్ని ప్రణాళికల్ని చెడగొట్టేసింది.
ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలను పవన్ పూర్తి చేసి ఖాళీ అవ్వడానికి అటు ఇటుగా ఏడాది సమయం పట్టొచ్చేమో. అప్పటిదాకా హరీష్ శంకర్ ఖాళీగా ఉండాల్సిందే. ఇప్పటికే పవన్ సినిమాకు స్క్రిప్టు పూర్తి చేసేసిన హరీష్.. ఈ ఖాళీలో వేరే సినిమా చేస్తాడేమో అన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఐతే ఈ ప్రచారానికి హరీష్ ఓ ఇంటర్వ్యూలో తెరదించాడు.
పవన్ సినిమా ముందు మరే చిత్రం చేసే అవకాశం లేదన్నాడు. తాను తన శ్రద్ధాసక్తులన్నింటినీ పవన్ సినిమా మీదే కేంద్రీకరించానని.. దాన్నుంచి పక్కకు వెళ్లాలనుకోవట్లేదని అతను స్పష్టం చేశాడు. పవన్ సినిమాకు స్క్రిప్టు పూర్తయిందన్న హరీష్.. ఇది ‘గబ్బర్ సింగ్’ లాగే అభిమానుల్ని ఉర్రూతలూగించేలా ఉంటుందని చెప్పాడు. పవన్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తానని.. ఈ సినిమాను వాళ్లు మళ్లీ మళ్లీ చూస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on July 13, 2020 6:03 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…