కొన్నేళ్ల నుంచి నవంబరు నెల టాలీవుడ్‌కు శాపంలా మారుతోంది. ఆ నెలలో సినిమాలేవీ పెద్దగా ఆడట్లేదు. అలా అని ఈ నెలలో సరైన సినిమాలు రిలీజ్ కావట్లేదా.. వాటికి మంచి టాక్ రావట్లేదా.. అంటే అదేమీ లేదు. కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి. మంచి టాక్ కూడా తెచ్చుకుంటున్నాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర అవి సందడి చేయలేకపోతున్నాయి. ఈ నవంబరు సంగతే తీసుకుంటే.. తొలి వారం ‘ఊర్వశివో రాక్షసివో’ లాంటి యూత్‌ను ఆకట్టుకునే సినిమా వచ్చింది.
ఈ సినిమా డీసెంట్ బజ్‌తో రిలీజైంది. పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మౌత్ పబ్లిసిటీ కూడా బాగానే ఉంది. కానీ టాక్‌కు తగ్గట్లుగా సినిమా వసూళ్లు రాబట్టలేకపోయింది. చివరికి బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ రిజల్ట్‌తో సరిపెట్టుకుంది. వీకెండ్ తర్వాత ‘ఊర్వశివో రాక్షసివో’ పెద్దగా సౌండే చేయలేదు. ఈ పరిణామం చూసి టాలీవుడ్ కొంచెం కంగారు పడే ఉంటుంది.
ఇక ఈ వారం ‘యశోద’ సినిమాతో సమంత బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమైంది. ఈ వారం తెలుగులో ఇది కాకుండా చెప్పుకోదగ్గ రిలీజ్‌లేమీ లేవు. హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ పాంతర్’ కొత్త వెర్షన్ నుంచి మాత్రమే దీనికి క్లాష్ ఉంది. పెద్దగా పోటీ లేకుండా, మంచి బజ్‌తో రిలీజవుతున్న సమంత సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుందన్నది ఆసక్తికరం. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు వస్తాయా.. ప్రేక్షకులను థియేటర్లకు ఆశించిన స్థాయిలో ఈ సినిమా రప్పించగలదా అని ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
దాదాపు రూ.24 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ కీలకం. మరి సమంత బాక్సాఫీస్ స్టామినా ఎంత వరకు ఈ సినిమాకు ఉపయోగపడి ఓపెనింగ్స్ రప్పిస్తుందో చూడాలి. హరి-హరీష్ అనే ఇద్దరు తమిళ దర్శకులు కలిసి ఈ బహు భాషా చిత్రాన్ని రూపొందించారు. మరి తమిళం, హిందీ భాషల్లో సామ్ సినిమా ఏమాత్రం ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరం. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ‘యశోద’ చిత్రాన్ని రూపొందించారు.
This post was last modified on November 11, 2022 1:47 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…