కబ్జా బిజినెస్ కి కెజిఎఫ్ చిక్కు

కెజిఎఫ్ దెబ్బకు శాండల్ వుడ్ స్టాండర్డ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక కాంతారతో ఇది నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. అందుకే అక్కడి నిర్మాతలు భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా వస్తున్నదే కబ్జా. దీని టీజర్ వచ్చి నెలలవుతోంది. ఇప్పటిదాకా రిలీజ్ డేట్ ఫైనల్ చేయలేదు. ఉపేంద్ర, కిచ్చ సుదీప్ కాంబోలో రూపొందిన ఈ మల్టీస్టారర్ లో శ్రియ, మనోజ్ బాయ్ పాయ్ తదితరులతో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. రవి బస్రూర్ లాంటి టెక్నికల్ టీమ్ తో అన్ని విషయాల్లో రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. ఇది కూడా దశాబ్దాల క్రితం జరిగిన ఓ మాఫియా గ్యాంగ్ స్టర్ స్టోరీనే

ఇక్కడే ఓ సమస్యోచ్చి పడింది. కబ్జా మీద కెజిఎఫ్ ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. గ్రాండియర్, సెటప్, విజువల్స్, ఎలివేషన్స్ అన్నీ దాన్నే తలంపుకు తెస్తున్నాయి. సంగీత దర్శకుడు సైతం ఒకడే కావడంతో ఆ ఫీల్ ఇంకా ఎక్కువైపోయింది. దీంతో కబ్జా నిర్మాతలు చెబుతున్న రేట్లకు బయ్యర్లు ముందు వెనుకా ఆడుతున్నట్టు బెంగళూరు టాక్. ఒకవేళ ఆ ధరలకు కొని ఏ మాత్రం అటుఇటు అయినా నష్టం మాములుగా ఉండదు. ఈ పోలికల గొడవ లేకపోతే ఇద్దరు హీరోలకు ఉన్న ఇమేజ్, మార్కెట్ కి ఈజీగా అమ్మేయొచ్చు. కాకపోతే కబ్జాకు పెట్టిన ఖర్చు చాలా ఎక్కువ.

మొత్తం రికవర్ కావాలంటే కన్నడ వెర్షన్ ఒకటే బాగా సేల్ అయితే సరిపోదు. తెలుగు హిందీ లాంటి ప్రధాన భాషల్లోనూ డిమాండ్ ఏర్పడాలి. అందుకే ముందు అనుకున్న డిసెంబర్ 25 విడుదలకు లాక్ అవ్వాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇంకా శాటిలైట్, ఓటిటి, డబ్బింగ్ డీల్స్ పూర్తి కాలేదు. ఎంత కెజిఎఫ్ ని జనాలు ఆదరించినంత మాత్రాన మళ్ళీ అదే సెటప్ తీసుకుంటే ఎలా. గ్యాప్ ఉంటే అది వేరే విషయం కానీ రాఖీ భాయ్ అరాచకం ఇంకా ప్రేక్షకుల మెదళ్లలో ఫ్రెష్ గానే ఉంది. ఒకవేళ ఈ ఏడాది చివర మిస్ అయితే మాత్రం కబ్జాకు తిరిగి 2023 ఫిబ్రవరిలో రావడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు