Movie News

ఫ్రేమ్ టు ఫ్రేమ్ అదే బుట్టబొమ్మ గురూ

ఒక్క ‘మాష్టర్’ ఫేం అర్జున్ దాస్ తప్పిస్తే.. మనకు ఏమాత్రం తెలియన ఒక కొత్త కాస్ట్‌తో ఇప్పుడు సితార ఎంటర్టయిన్మెంట్ సంస్థ ‘బుట్టబొమ్మ’ అనే సినిమాతో విచ్చేస్తోంది. ఈరోజు తమ డార్లింగ్ డైరక్టర్ త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సంస్థ సదరు సినిమా టీజర్‌ను విడుదల చేసిందిలే. ఇకపోతే మలయాళం సినిమాలను అదే పనిగా చూసేవాళ్ళకు, ఈ సినిమా ‘కప్పేలా’ అనే మల్లూ మూవి రీమేక్ అని ఇట్టే అర్ధమవుతోంది. ఇద్దరు డైరక్టర్లు కలసి రూపొందించిన ఈ రీమేక్‌లో మరి భీమ్లానాయక్‌ను మార్చేసినట్లు ఏమన్నా చేంజెస్ చేశారా లేకుంటే యాజిటీజ్ దించేశారా అనేదే ఇప్పుడు ఆడియన్స్ గమనిస్తున్న అంశం.

భీమ్లానాయక్ సినిమాను మాత్రం యాజిటీజ్ దించేయకుండా చాలా జాగ్రత్తగా రీమేక్ చేసేశారు సితార వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్‌ హీరోగా చేస్తున్నాడనో, లేదంటే సినిమాను త్రివిక్రమ్ రాస్తున్నాడనో కాని, ఒరిజినల్‌లో లేని హీరోయిజంను జోడించి, సీన్లలో పదును పెంచి, అయ్యప్పానుం కోషియానుం సినిమా రూపురేఖలు మార్చేశారు. అయితే ఇప్పుడు మాత్రం బుట్టబొమ్మ టీజర్ చూస్తుంటే.. కొత్త కాస్టింగ్ మరియు ఒక అందమైన హీరోయిన్‌ను (అనికా సురేంద్రన్) తేవడం మినహాయిస్తే.. డైలాగులూ, షాట్లు, బ్లాకులూ, చివరకు ట్రైలర్ కట్ కూడా మలయాళం సినిమా ఎలా ఉందో అలాగే దించారు. అరకులోయను అందంగా చూపించడం తప్పించి.. మిగతా అంతా సేమ్ టు సేమ్ అన్నట్లే ఉంది. అందుకే ఇప్పుడు బుట్టబొమ్మ, కప్పేలా ట్రైలర్లను కలిపి చూస్తున్న ఆడియన్స్ అవాక్కవుతున్నారు.

ఈ మధ్యకాలంలో చాలా రీమేక్ సినిమాలు కిక్కివ్వట్లేదు. తెలుగు సినిమాలు హిందీలో ఆడట్లేదు, తమిళ మలయాళ సినిమాలు ఇక్కడ ఆడట్లేదు. కారణం ఏంటంటే.. మనోళ్ళు భారీగా మార్పులూ చేర్పులూ చేయకుండా మాతృకలో ఉన్నవి యాజిటీజ్ దించేయడం వలనే. ఈ తరుణంలో సితార వంటి సంస్థ మరో రీమేక్‌తో వస్తోందంటే.. జనాలకు ఎక్సపెక్టేషన్లు కాస్త ఎక్కువగానే ఉంటాయ్. అందుకే ఇప్పుడు బుట్టబొమ్మ గురించి అంతలా చర్చిస్తున్నారు.

This post was last modified on November 7, 2022 4:02 pm

Share

Recent Posts

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

55 minutes ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

3 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

3 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

3 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

5 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

8 hours ago