తన దర్శకత్వంలో మొదలైన సినిమా షూటింగ్‌కు హాజరు కాకుండా విశ్వక్సేన్ ఇబ్బంది పెట్టాడని.. షూట్‌కు అంతా రెడీ చేసుకున్నాక క్యాన్సిల్ చేయించాడని.. విశ్వక్ కమిట్మెంట్ లేని నటుడని.. ఇలాంటి అన్ ప్రొఫెషనల్ యాక్టర్‌ను ఇప్పటిదాకా చూడలేదని రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు గుప్పించారు సీనియర్ నటుడు, దర్శకుడు అర్జున్. దీనిపై రెండు రోజులు మౌనం వహించిన విశ్వక్.. ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించాడు.
అర్జున్‌కు తన వల్ల కలిగిన ఇబ్బందికి సారీ చెబుతూనే.. ఈ వివాదంలో తన వాదన ఏంటో అతను వివరించే ప్రయత్నం చేశారు.ఇప్పటిదాకా తాను చేసిన సినిమాలకు సంబంధించి ఎవ్వరైనా సరే.. తాను కమిటెడ్, ప్రొఫెషనల్ కాదు అంటే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని.. తన వల్ల ఇప్పటిదాకా ఎవ్వరూ బాధ పడలేదని, ఒక్క రూపాయి నష్టపోలేదని అతను అన్నాడు.
అర్జున్ సినిమాకు సంబంధించి అసలేం జరిగిందో వివరిస్తూ.. “షూట్ మొదలయ్యే వారం ముందు నాకు స్క్రిప్టు అందింది. నేను ఆఫీస్ బాయ్ ఇన్‌పుట్ కూడా వింటా అని అర్జున్ సార్ అన్నారు. ఫలానా మార్పు చేస్తే బాగుంటుంది సార్ అని నేను అంటే.. నన్ను నమ్ము, నువ్వు వదిలేయ్ అంటూ నన్ను ఏమీ చెప్పనిచ్చేవారు కాదు. పది విషయాల్లో రెండు నా ఇష్టానికి వదిలేసినా మా జర్నీ సాఫీగా సాగిపోయేది. కానీ నన్ను కట్టిపడేశారు. అయినా ఏదో విధంగా ముందుు వెళ్లాలి అనుకుని లుక్ టెస్ట్ చేసి ఆయనకు పంపించాను. కానీ మరుసటి రోజు లేచి షూటింగ్‌కు వెళ్లే ముందు భయమేసింది. ఏ సినిమాకూ ఇలా అనిపించలేదు.
అందుకే ‘సార్.. ఈ ఒక్క రోజు షూట్ క్యాన్సిల్ చేయండి. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం’ అని మెసేజ్ పెట్టా. మా మేనేజర్ ఎన్నిసార్లు అడిగినా ఆయన నుంచి సమాధానం రాలేదు. తర్వాత వాళ్ల మేనేజర్ ఫోన్ చేసి ఇంకేటి మాట్లాడేది అంటూ అకౌంట్ వివరాలు పంపించారు. సినిమా నుంచి తప్పుకుంటానని నేను చెప్పలేదు. నేను సినిమాను ఆపలేదు. షూట్‌కు అంతా రెడీ చేసుకున్నాక క్యాన్సిల్ చేయడం తప్పే. నాలుగు రోజులు అయిష్టంగా పని చేసి కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. కానీ నాకు ఇబ్బంది కలిగితే నాలుగు గోడల మధ్యే మాట్లాడా. ఆయనకు గౌరవం ఇచ్చా. కానీ అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇబ్బంది పడుతున్నారు. నన్ను ఆ సినిమా నుంచి తొలగించారు. దాని గురించి నేనెందుకు మాట్లాడాలి అనుకుని ఇప్పటిదాకా స్పందించలేదు . నా వల్ల ఇబ్బంది పడి ఉంటే క్షమించండి సార్” అని అర్జున్‌ను ఉద్దేశించి విశ్వక్ పేర్కొన్నాడు.
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…