మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలొచ్చారు. అందులో చాలామంది నిలదొక్కుకున్నారు. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తిరుగులేని ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించారు. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా పర్వాలేదు. వైష్ణవ్ తేజ్‌కు గ్రాండ్ ఎంట్రీ దక్కింది. ఆ తర్వాత కొంచెం తడబడుతున్నప్పటికీ.. మళ్లీ పుంజుకోగలడనే అంచనాలు ఉన్నాయి. కానీ అరంగేట్రం చేసి చాలా ఏళ్లయినా హీరోగా సరైన ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్న మెగా హీరో అంటే అల్లు శిరీష్ అనే చెప్పాలి.
‘గౌరవం’ లాంటి డిజాస్టర్‌తో హీరోగా పరిచయం కావడం అతడికి పెద్ద మైనస్. రెండో సినిమా ‘కొత్త జంట’ కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ‘శ్రీరస్తు శుభమస్తు’ ఒకటి అతడికి మంచి ఫలితాన్నిచ్చింది. కానీ ఆ విజయాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఒక్క క్షణం, ఏబీసీడీ సినిమాలు అతణ్ని మళ్లీ కిందికి లాగేశాయి. ఆ తర్వాత మూడేళ్ల పాటు శిరీష్ సినిమా ఏదీ రిలీజ్ కాకపోవడంతో అతణ్ని అందరూ మరిచిపోయారు.
శిరీష్ మీద మొదట్నుంచి ఎందుకో ఒక నెగెటివిటీ ఉండిపోయింది. టాలెంట్ లేకపోయినా బలవంతంగా రుద్దుతున్నారనో.. అతడికి యాటిట్యూడ్ అనో జనాలు అతణ్ని కొంచెం నెగెటివ్ కోణంలో చూశారు కెరీర్ ఆరంభంలో. కొన్నిసార్లు వ్యక్తిగతంగా హీరో మీద ఉన్న అభిప్రాయం కూడా సినిమాల మీద ప్రభావం చూపుతుంటుంది. శిరీష్ విషయంలో కూడా అదే జరిగింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ మంచి సినిమా కావడం వల్ల ఆడింది. అంతే తప్ప శిరీష్ దానికి ప్లస్ కాలేదన్నది స్పష్టం.
ఐతే గత సినిమాల సంగతి పక్కన పెడితే ‘ఊర్వశివో రాక్షసివో’లో మాత్రం ప్రేక్షకులకు కొత్త శిరీష్ కనిపించాడు. ఈ సినిమా ప్రమోషన్ల టైంలో కూడా శిరీష్ కొత్తగా కనిపించాడు. వయసుతో పాటు వచ్చిన మెచ్యూరిటీ వల్ల కావచ్చు అతడి మాటతీరు మారింది. ఇంతకుముందున్న నెగెటివిటీ పోయింది. సినిమాలో కూడా పాత్రను అర్థం చేసుకుని చక్కగా నటించాడు. ఎక్కడా అతి చేయలేదు. నటన విషయంలో ఇబ్బంది పడలేదు. అమాయకమైన కుర్రాడిగా ఒదిగిపోయాడు. ఆ పాత్రు చెడగొట్టకపోవడమే పెద్ద ప్లస్. శిరీష్ మీద నెగెటివ్ ఫీలింగ్ ఉన్న వాళ్లు కూడా ఈ సినిమా చూశాక తన మీద అభిప్రాయం మార్చుకుంటారనడంలో సందేహం లేదు. సినిమా మంచి టాక్, వసూళ్లతో సాగిపోతుండడంతో శిరీష్ కెరీర్ ఊపందుకునేలాగే కనిపిస్తోంది.
This post was last modified on %s = human-readable time difference 10:32 am
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…