లాక్ డౌన్ వేళ ఫిలిం సెలబ్రెటీలందరూ కొత్త కొత్త అవతారాల్లో కనిపిస్తున్నారు. ఇంతకుముందెన్నడూ వారిలో చూడని కోణాలు బయటికి వస్తున్నాయి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్ కూడా.. ఇప్పుడు ఎన్నడూ చూడని అవతారంలోకి మారాడు. అతను రైతుగా మారడం విశేషం. ముంబయి శివార్లలోని పాన్వెల్ ప్రాంతంలో సల్మాన్‌కు ఒక భారీ ఫామ్ హౌస్ ఉంది. అది వందల ఎకరాల్లో ఉంటుందని అంటారు.
తన రొమేనియా గర్ల్ ఫ్రెండ్ లులియా వాంతూర్, కొందరు సన్నిహితులతో కలిసి సల్మాన్ కొంత కాలంగా ఆ ఫాం హౌస్‌లోనే ఉంటున్నాడు. రెండు రోజుల కిందటే సల్మాన్ తన ఫాం హౌస్‌లో నీటి మడుగులు, పంట పొలాల మధ్య లులియా, సన్నిహితులతో కలిసి నడుస్తున్న వీడియోలు బయటికి వచ్చాయి. అవి అభిమానులకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. తాజాగా సల్మాన్ ఖానే స్వయంగా ఒక ఆసక్తికర ఫొటో పెట్టాడు. దానికి అద్భుతమైన స్పందన వస్తోంది.
సల్మాన్ రెండు చేతుల్లో వరి నాట్లు పట్టుకుని అచ్చమైన రైతులగా కనిపిస్తున్నాడు ఆ ఫొటోలో. ఖాన్‌ను ఇలాంటి అవతారంలో ఎప్పుడూ చూసింది లేదు అభిమానులు. సినిమాల్లో సైతం అతను ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. ఆ ఫొటో పెట్టి.. ‘ప్రతి గింజ మీదా తినేవాడి పేరు రాసి ఉంటుంది. జై జవాన్ జై కిసాన్’ అని కామెంట్ కూడా జోడించాడు. ఈ ట్వీట్ పెట్టిన 12 గంటల్లోనే లక్షా 30 వేలకు పైగా లైక్స్, అదే స్థాయిలో రీట్వీట్లు విశేషం.
This post was last modified on July 12, 2020 1:42 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…