ఆరు నెల‌ల్లోపే పొన్నియ‌న్ సెల్వ‌న్-2

ఇత‌ర భాష‌ల్లో నెగెటివ్ టాక్ తెచ్చుకుని నామ‌మాత్ర‌పు వ‌సూళ్లు సాధిస్తేనేమి.. త‌మిళంలో మాత్రం అపూర్వ ఆద‌ర‌ణ ద‌క్కించుకుని కోలీవుడ్ చ‌రిత్ర‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది పొన్నియ‌న్ సెల్వ‌న్‌-2. త‌మిళంలో అత్యంత గొప్ప న‌వ‌లగా పేరున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ న‌వ‌ల ఆధారంగా మ‌ణిర‌త్నం ఈ సినిమాను తెర‌కెక్కించి ద‌శాబ్దాల క‌ల‌ను నెర‌వేర్చుకున్నాడు.

ఈ న‌వ‌ల మాదిరే సినిమాను కూడా త‌మ ప్రైడ్‌గా భావించిన త‌మిళులు.. ఈ సినిమా చూడ‌డాన్ని ఒక బాధ్య‌త‌లా భావించారు. మిగ‌తా భాష‌ల వాళ్లు ఏమ‌న్నా ప‌ట్టించుకోకుండా సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌మిళులు ఉన్న ప్ర‌తిచోటా సినిమాకు అద్భుత ఆద‌ర‌ణ ద‌క్కింది. ఏకంగా రూ.400 కోట్ల దాకా వ‌సూళ్లు సాధించింది పొన్నియ‌న్ సెల్వ‌న్. సినిమా ఇంత పెద్ద హిట్ట‌వ‌డం మ‌ణిర‌త్నం అండ్ కోకు అమితానందాన్నిచ్చేదే.

ఈ ఉత్సాహంలో పొన్నియ‌న్ సెల్వ‌న్-2ను విడుద‌ల‌కు సిద్ధం చేయ‌బోతోంది మ‌ణి బృందం. బాహుబ‌లి, పుష్ప సినిమాల మాదిరి ఒక పార్ట్ తీశాక నెమ్మ‌దిగా రెండో పార్ట్‌ను తెర‌కెక్కించ‌డం చేయ‌ట్లేదు మ‌ణిర‌త్నం. పొన్నియ‌న్ సెల్వ‌న్ రెండో పార్ట్‌ను కూడా ఆయ‌న దాదాపుగా పూర్తి చేసేశారు. ఆయ‌న దృష్టిలో ఇది ఒకే క‌థ‌. ఒకే సినిమా.

కాక‌పోతే నిడివి ఎక్కువ అని రెండు భాగాలు చేసి సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. సెకండ్ పార్ట్ షూట్ దాదాపుగా పూర్త‌యిన‌ట్లే చెబుతున్నారు. కొంత మేర టాకీ పార్ట్ ఏమైనా మిగిలి ఉండొచ్చు. అవి కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా అవ‌గొట్టి ఇంకో ఆరు నెల‌ల్లోపే సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

స‌లార్ సినిమా ఖాళీ చేసిన డేట్‌లో ఈ సినిమా వ‌స్తుంద‌ని అంటున్నారు. 2023 ఏప్రిల్ 28కి పీఎస్-2 రిలీజ్ డేట్ ఖ‌రారైంద‌ట‌. అదే తేదీలో మ‌హేష్ బాబు-సుకుమార్ సినిమాకు కూడా రిలీజ్ ఫిక్స్ చేశారు. కానీ అది వాయిదా ప‌డే అవ‌కాశాలు లేక‌పోలేదు. మ‌హేష్ సినిమా వ‌చ్చినా పీఎస్-2 కూడా అదే రోజు రావ‌డం ప‌క్కా అట‌. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌.