విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ సార్జా దర్శకత్వంలో మొన్నీ మధ్యే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అర్జున్ ఈ సినిమాతో తన కూతురు ఐశ్వర్య ను హీరోయిన్ గా లాంచ్ చేయాలనుకున్నారు. హీరో విశ్వక్ లేకుండా కొన్ని రోజులు షూటింగ్ జరిగిన ఈ సినిమా ఇప్పుడు అనుకోకుండా క్యాన్సెల్ అయిపోయింది. స్వయంగా అర్జున్ మీడియా ముందుకొచ్చి విశ్వక్ సేన్ ప్రవర్తన నచ్చలేదని , ఎప్పటికప్పుడు షూటింగ్ పోస్ట్ పోన్ చేయమంటూ చెప్తూ ఫైనల్ గా తనని తన టీం అందరినీ అవమానించాడని తన వర్షన్ బయట పెట్టి త్వరలోనే మరో హీరోతో సినిమా చేస్తానని తెలిపాడు.
విశ్వక్ కి కథ బాగా నచ్చిందని , కానీ కొందరు టాప్ టెక్నీషియన్స్ వర్క్ ఆయనకి సాటిస్ఫ్యాక్షన్ ఇవ్వలేదని చెప్పాడు అర్జున్. ఈ సినిమాకు డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా , ఆయన డైలాగ్స్ విశ్వక్ సేన్ కి నచ్చలేదని, అలాగే చంద్ర బోస్ లిరిక్స్ ఇష్టపడటంలేదని , ఇక అనూప్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం కూడా ఇష్టం లేదని ఈ రీజన్స్ వల్లే తను నన్ను టీం ను ఇబ్బంది పెట్టి షూటింగ్ కి రాకుండా స్కిప్ కొడుతున్నాడని అర్జున్ చెప్పుకున్నాడు.
నిజానికి విశ్వక్ సేన్ స్క్రిప్ట్ లో వేలు పెడతాడని, షూటింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాడని ముందు నుండి ఓ టాక్ ఉంది. దాస్ కా దమ్కీ సినిమాకు ముందుగా వేరే దర్శకుడిని పెట్టి తర్వాత విశ్వక్ అతన్ని ప్రాజెక్ట్ నుండి తప్పించి డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే రైటర్ ప్రసన్న దగ్గర కథ తీసుకొని తనకి తోచిన మార్పులు చేసుకున్నాడనే వార్త కూడా మార్కెట్ లో వినిపిస్తుంది. అందుకే రైటర్ ప్రసన్న కూడా ఈ ప్రాజెక్ట్ కి దూరంగా ఉంటున్నాడని టాక్ ఉంది. అయితే ఇప్పుడు టెక్నీషియన్స్ విషయంలో విశ్వక్ సేన్ ఇవాల్వ్ అవుతాడని అర్జున్ మాటలు వింటుంటే క్లియర్ గా అర్థమవుతుంది. మరి తనపై ప్రెస్ మీట్ పెట్టి అర్జున్ చెప్పిన ఈ విషయాలకు విశ్వక్ సేన్ ఎలా క్లారిటీ ఇస్తాడో .. టెక్నీషియన్స్ గురించి తన వర్షన్ ఏం వినిపిస్తాడో తెలియాలి.
This post was last modified on November 6, 2022 8:17 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…