రెండు సినిమాలు దర్శకత్వం వహించిన అనంతరం ఊహించని విధంగా మరణించిన డైరెక్టర్ శోభన్ కొడుకు సంతోష్ శోభన్ ‘తను నేను’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బిజీ యాక్టర్ అనిపించుకున్నాడు. అయితే సంతోష్ శోభన్ కి టాలెంట్ ఉంది. నటనలో మంచి ఈజ్ తో ముందుకు వెళ్తున్నాడు. బడా సంస్థలు , మంచి దర్శకుల నుండి ఆఫర్లు రానే వస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ కూడా ఉండనే ఉంది. కానీ కుర్ర హీరోకి మాత్రం సరైన హిట్ పడట్లేదు. కెరీర్ మొదలు పెట్టి ఏడేళ్ళవుతుంది ఇంత వరకూ సంతోష్ కి థియేటర్స్ లో హిట్ అనిపించుకున్న ఒక్క సినిమా లేదు.
డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన ‘ఏక్ మినీ కథ’ సంతోష్ కి మంచి గుర్తింపు తెచ్చింది. ఓటీటీ ఆడియన్స్ ను ఆ సినిమా అలరించింది. దీంతో సంతోష్ ఓటీటీ లో సక్సెస్ అయ్యాడు. కానీ థియేటర్స్ లో రిలీజైన ‘పేపర్ బాయ్’ , ‘మంచి రోజులొచ్చాయి’ మాత్రం ఫ్లాప్ అనిపించుకున్నాయి. తాజాగా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ అనే సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరోకి మరో ఫ్లాప్ ఎదురైంది. సినిమా పాయింట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేనందున ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరిస్తున్నారు. పైగా కామెడీ సిల్లీగా ఉందనే టాక్ అందుకుంది.
తన టాలెంట్ తో మంచి అవకాశాలు అందుకుంటున్నా సంతోష్ కి ఎందుకో లక్ చేతికి చిక్కడం లేదు. నెక్స్ట్ నందిని రెడ్డి దర్శకత్వంలో ‘అన్ని మంచి శకునములే’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రేమ్ కుమార్ అనే సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. రాబోయే ఈ సినిమాలయినా థియేటర్స్ లో విజయం అందుకొని సంతోష్ ని హీరోగా నిలబెడతాయేమో చూడాలి.
This post was last modified on November 6, 2022 12:44 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…