ఆ మధ్య ఎంతో అట్టహాసంగా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా విశ్వక్ సేన్ హీరోగా లాంచ్ చేసిన సినిమా తాలూకు ప్రారంభోత్సవం ఇంకా జనాలు పూర్తిగా మర్చిపోలేదు. జగపతిబాబుతో పాటు ఎందరో సీనియర్ క్యాస్టింగ్ అందులో ఉన్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, అనూప్ రూబెన్స్ సంగీతం ఇలా టెక్నికల్ టీమ్ మొత్తం పక్కాగా సెట్ చేసుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడా ప్రాజెక్టు ఆగిపోయింది. విశ్వక్ సేన్ ప్రవర్తన వల్లే తాను ఆపేస్తున్నానని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
అర్జున్ చెప్పిన వెర్షన్ ప్రకారం ఇప్పటికే పలుమార్లు విశ్వక్ వల్ల షూటింగ్ వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, నవంబర్ మొదటి వారంలో ప్లాన్ చేసుకున్న షూట్ కు సైతం తెల్లవారుఝామున అయిదు గంటల ప్రాంతంలో రాలేనని చెప్పి ఇబ్బంది పెట్టాడని, ఇది తనకు మాత్రమే కాదు యూనిట్ మొత్తానికి అవమానంగా భావిస్తూ ఇకపై కొనసాగించే ఉద్దేశం తనకు ఎంత మాత్రం లేదని కుండబద్దలు కొట్టేశారు. తన నలభై రెండేళ్ల కెరీర్ లో ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడని తనకు ఇప్పుడిలా మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో అర్థం చేసుకోమని అన్ని విషయాలు చెప్పారు.
ఇది సోషల్ మీడియాలో ఉదయం నుంచే లీకవుతున్న వార్తనే అయినా అర్జున్ అఫీషియల్ గా చెప్పాక మబ్బులన్నీ వీడిపోయాయి. అల్లు అర్జున్, రామ్ లాంటి యంగ్ స్టర్స్ తో పనిచేసినప్పుడు కలగని ఇబ్బంది ఇప్పుడే వచ్చిందని, స్కిన్ టాన్ అయ్యిందని, బాడీ షేపింగ్ చేసుకుని పర్ఫెక్ట్ గా వస్తానని చెప్పిన విశ్వక్ తర్వాత ఇలా చేయడం పట్ల చాలా మనస్థాపం చెందానని అర్జున్ వివరించారు. ఇకపై వేరే హీరోతో ఇదే బృందంతో కంటిన్యూ చేస్తానని చెప్పిన అర్జున్ త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తారట. యాక్షన్ కింగ్ అంతటి సీనియర్ అభాండాలు వేశారు కాబట్టి ఇప్పుడు విశ్వక్ సేన్ తనవైపు ఏం చెప్తాడనే దాన్ని బట్టి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా వెంటనే ఒక నిర్ధారణకు రాలేం
This post was last modified on November 5, 2022 5:31 pm
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…