టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మరో శుక్రవారం డల్లుగా మొదలైంది. పేరుకు పది సినిమాలు రిలీజయ్యాయనే కానీ.. అందులో సౌండ్ చేసిన సినిమాలు చాలా చాలా తక్కువ. ఒక అరడజను సినిమాలు అసలు రిలీజవుతున్న సంకేతాలు కూడా ఏమీ కనిపించడం లేదు. నామమాత్రంగా థియేటర్లలోకి దిగాయి ఆ చిత్రాలు. మిగతా వాటిలో కూడా బజ్ క్రియేట్ అయినవి చాలా తక్కువ.
లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, తగ్గేదేలే, బొమ్మ బ్లాక్‌బస్టర్ చిత్రాలు కూడా నెగెటివ్ టాక్‌తో మొదలయ్యాయి. ఈ సినిమా ప్రోమోల్లో కనిపించిన సందడి సినిమాల్లో కనిపించలేదన్నది టాక్. మొత్తం కొత్త రిలీజుల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నది ఒక్క ఊర్వశివో రాక్షసివో మాత్రమే. దీనికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఏమీ ఆశించిన స్థాయిలో జరగలేదు. కానీ తొలి రోజు ఇటు రివ్యూలు, అటు మౌత్ టాక్ బాగుండడం దీనికి కలిసొచ్చే అంశం.
టీజర్, ట్రైలర్ చూసి సినిమాలో ఏముంటాయని ఆశించారో అవే సినిమాలో ఉన్నాయి. ప్యార్ ప్రేమ కాదల్ అనే బోల్డ్ తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో ఒరిజినల్‌కు ఏమాత్రం తగ్గని విధంగా అడల్ట్ డోస్ ఇచ్చారు. సినిమాలో లెక్కపెట్టుకోలేనన్ని లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. అలాగే బెడ్డు మీద ఇంటిమేట్ సీన్లకూ కొదవలేదు. ఇక డబుల్ మీనింగ్ డైలాగులైతే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.
మారుతి కెరీర్ ఆరంభంలో తీసిన సినిమాల స్థాయిలో అడల్ట్ జోకులు బోలెడన్ని పేల్చారు. కాకపోతే మరీ వల్గర్‌గా అనిపించకుండా.. యూత్ ఎంజాయ్ చేసేలా ఆ జోకులు ఉండడం ప్లస్. చివరి 20 నిమిషాల్లో మినహాయిస్తే సినిమా అంతటా కామెడీ బాగా వర్కవుట్ అయింది. రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో కామెడీ పండడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయింది. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ చూడడం కష్టం. కానీ యూత్‌కు మాత్రం మంచి కిక్కిచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి. రొమాన్స్, ఫన్ కోసం అయితే ఈ సినిమాపై ఓ లుక్కేయొచ్చు. మరి పాజటివ్ టాక్‌ను సినిమా ఎంతమేర ఉపయోగించుకుంటుందో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 4:23 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…