న్యూ ఏజ్ ఆడియన్స్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. కాలం ఎంత మారినా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా సినిమాలకు సంబంధించి మాత్రం ఒక నిర్దిష్టమైన గ్రామర్ ఉంటుంది. అది పాటించే తీరాలి. అంతే తప్ప ట్రెండ్ నడుస్తోంది కదాని ఏది బడితే అది కాన్సెప్ట్ గా తీసుకుంటే తేడా కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. తాజాగా రిలీజైన లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చూస్తే అదే అనిపిస్తుంది. ఓటిటి స్టార్ గా ఎక్కువ గుర్తింపు ఉన్న సంతోష్ శోభన్, జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనరిది.
ఎడతెరిపి లేకుండా దీని ప్రమోషన్లను గత వారం పది రోజులుగా చేస్తూనే ఉన్నారు.హీరో సంతోష్, కమెడియన్ సుదర్శన్ లు కలిసి తమ సినిమా మీదే తామే జోకులు వేసుకుని ఆడియెన్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ తో కలిసి కాలేజీలు మాల్స్ విపరీతంగా తిరిగేశారు. ఇంతకష్టపడినా ఇవాళ ఓపెనింగ్స్ లేవు. ఇది ముందే ఊహించారు కాబట్టి పూర్తిగా టాక్ మీద డిపెండ్ అయ్యారు. కానీ లైక్ షేర్ సబ్ స్క్రైబ్ ఆకట్టుకోవడంలో విపరీతంగా తడబడిపోయింది. ట్రావెల్ వ్లోగర్స్ థీమ్ ని తీసుకుని దానికో కిడ్నాప్ డ్రామాని జోడించి ఏదో కొత్తగా ట్రై చేద్దామనుకున్న గాంధీ నిలువునా దొరికిపోయారు.
ప్రయాణాలు చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేసి పేరు డబ్బు సంపాదించాలనుకున్న యువతీ యువకులు అరకు అడవిలో నక్సల్ ముఠాకు దొరికితే జరిగే రాద్ధాంతమే ఈ సినిమా. కామెడీగా సీరియస్ గా ఎమోషనల్ గా యాక్షన్ ఓరియెంటెడ్ గా ఇలా అన్ని రకాల అంశాలను మిక్స్ చేసి ఏదో కొత్తగా వడ్ఢిద్దాం అనుకున్న మేర్లపాక గాంధీ దేన్నీ సరిగా బాలన్స్ చేయలేక సహనానికి పరీక్ష పెట్టేశారు. మాములు జోకులకు జనం నవ్వడం లేదు. లౌడ్ కామెడీ జబర్దస్త్ లో దొరుకుతోంది. అలాంటప్పుడు ఎంటర్ టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వీక్ కంటెంట్ వల్ల లైక్ కాలేక షేర్ కుదర్లేక సినిమా మధ్యలో నలిగిపోయింది.
This post was last modified on November 4, 2022 10:09 pm
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…