సమంతా టైటిల్ రోల్స్ చేసే సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. వాటిని చూసి ఆదరించే ఆడియన్స్ ఉన్నారని ఓ బేబీ నుంచి ఋజువవుతూనే వస్తోంది. అయితే బడ్జెట్ పరిమితులు పాటించినంత వరకు ఈజీగా రిస్కు చేయొచ్చు. అలా కాకుండా ఖర్చు పెట్టే విషయంలో ఏ మాత్రం గ్రాఫ్ పెరిగినా ఆ ఒత్తిడిని భరించడం అంత సులభం కాదు. శాకుంతలం విషయంలో నిర్మాత కం దర్శకుడు గుణశేఖర్ ఇలాంటి ఒత్తిడినే ఫేస్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. నిజానికి డిసెంబర్ లో అనుకున్న విడుదల కాస్తా సామ్ హెల్త్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. ముందు ఆ కారణం చెప్పలేదు
దానికి తోడు త్రీడి సాంకేతికతను జోడిస్తున్నామని గుణశేఖర్ ప్రకటించడంతో ఫైనల్ గా బడ్జెట్ 70 కోట్లను దాటేసిందని వినికిడి. ఏడాదికి పైగా నిర్మాణంలో ఉండటంతో వడ్డీల లెక్కలు కలిపి భారంగా మారిందని సమాచారం. ఇప్పటికిప్పుడు సినిమాను అమ్మినా అంత మొత్తం రాదు. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్ జరగలేదు. మణిశర్మ సంగీతంలో కనీసం ఓ పాటనైనా రిలీజ్ చేసి ఉంటే కొంత అవగాహన వచ్చేది. ఇలాంటి వాటికి టీజర్ ఆషామాషీగా ఉండకూడదు కాబట్టి దానికీ ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది.
ఇవన్నీ విశ్లేషించుకుంటే శాకుంతలం రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. వచ్చే వారం యశోద ఫలితం పట్ల గుణ టీమ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అసలు సమంతా ఆరోగ్యం పూర్తిగా ఎప్పుడు కుదుటపడుతుందో అంతు చిక్కడం లేదు. తను ఎప్పటిలాగా బయటికి వస్తేనే శాకుంతలంని ప్రమోట్ చేసుకోవడానికి వీలవుతుంది. లేదంటే ఎంత ఆలస్యమైనా సరే వేచి చూడక తప్పదు. పైగా ఈ చిత్రం బాహుబలి లాగా ఫాంటసీ కాదు హై వోల్టేజ్ యాక్షన్ సీన్లున్న రుద్రమదేవి కాదు. ఇప్పటి జెనరేషన్ కు చాలా నేర్పుగా చెప్పాల్సిన ఒక హిస్టారికల్ లవ్ స్టోరీ. మరి గుణశేఖర్ ఎలా చూపించబోతున్నారో.
This post was last modified on November 4, 2022 8:53 am
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…