‘బాహుబలి’ ప్లానింగ్ తోనే ‘పుష్ప 2’ ?

రామోజీ ఫిలిం సిటీలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకున్న తక్కువ సినిమాలో మొదటి స్థానం ‘బాహుబలి’ దే. ప్రభాస్ ,రానా , అనుష్క, తమన్నా లతో రాజమౌళి తీసిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ మొత్తం రామోజీ లోనే షూటింగ్ జరుపుకుంది. మొదట్లో కర్నూల్ లో కొంత పార్ట్ తీసినప్పటికీ జనాల తాకిడి తట్టుకోలేక రాజమౌళి వెంటనే రామోజీ ఫిలిం సిటీకి షూట్ షిఫ్ట్ చేసేసుకున్నాడు. అందులోనే భారీ సెట్స్ వేసుకొని అక్కడే ఉంటూ షూటింగ్ పూర్తి చేసుకున్నారు.

రానూ , పోనూ సమయం వృధా అవ్వకుండా ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ కి అక్కడే స్టేయింగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు సుకుమార్ కూడా ‘పుష్ప 2 ‘ కి ఇదే ప్లానింగ్ ను ఫాలో అవ్వబోతున్నాడు. సినిమాలో ఎక్కువ భాగం ఆర్ ఎఫ్ సి లోనే ప్లాన్ చేసుకుంటున్నాడట సుక్కు. ఇందుకోసం ఇప్పటికే ప్రిపరేషన్ మొదలు పెట్టేశారట. ఈ నెల 8 నుండి రామోజీ ఫిలిం సిటీ లో యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారు. డ్రాగన్ ప్రకాష్ కంపోజ్ చేయబోతున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందట. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఫిలిం సిటీలో భారీ సెట్ వర్క్ సెట్ వర్క్ జరుగుతుందని సమాచారం.

ఫిలిం సిటీలో కొన్ని రోజుల షూట్ తర్వాత యూనిట్ బ్యాంకాక్ లో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత జపాన్ లో కూడా షూట్ ఉంటుందని తెలుస్తుంది. మరోసారి మారేడుమిల్లి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అయితే అక్కడ కొన్ని రోజుల పాటు మాత్రమే షూట్ చేస్తారని, సినిమాలో ఎక్కువ భాగాన్ని రామోజీ ఫిలిం సిటీలోనే షూట్ చేసి వీలైనంత త్వరగా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. ఇప్పటికే ‘పుష్ప ది రూల్’ కి సంబంధించి బన్నీ లేకుండా కొన్ని రోజులు షూట్ చేసేశాడు సుక్కు. నవంబర్ 8 నుండి మొదలయ్యే షెడ్యుల్ నుండి అల్లు అర్జున్ పాల్గొంటాడు.