ఎట్టకేలకు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ వస్తే మొదటి భాగం రిలీజై ఏడాది పూర్తి కావొస్తుంది. అందుకే అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా అసహనంతో ఉన్నారు. వాళ్ళను సంతృప్తి పరుస్తూ ఫైనల్ గా అప్ డేట్ అయితే ఇచ్చారు. ముందు రామోజీ ఫిలిం సిటీలో మొదలుపెట్టి బ్యాంకాక్ లో ఒక షెడ్యూల్ తో పాటు మరో రెండు దేశాల్లో కీలక ఎపిసోడ్స్ షూట్ చేస్తారని సమాచారం. డేట్లు టైం ఫలానా వివరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. బన్నీ వెంటనే జాయిన్ అవుతాడా లేక ఇంకొద్ది రోజులు పడుతుందా అనేది వెయిట్ చేయాలి.
దీనికి సంబంధించి మరో ఎగ్జైటింగ్ లీక్ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం పుష్ప 2లో అల్లు అర్జున్ పులితో ఫైట్ చేసే ఒక సీన్ ఉందట. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ చేశాడు కానీ అది మత్తుమందిచ్చి పడగొట్టే విధంగా డిజైన్ చేశారు. కానీ పుష్ప 2లో మాత్రం దాంతో కలబడి అది దాడి చేసిన వాళ్ళను రక్షిస్తూనే చివరికి చంపేలా దర్శకుడు సుకుమార్ చాలా ఇంటెన్సిటీతో డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. ట్రిపులార్ తో ఏ కోణంలోనూ పోలిక రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారట. ఇది అఫీషియల్ గా చెప్పలేదు కానీ దీనికి సంబంధించిన సిజి వర్క్ ఆల్రెడీ మొదలుపెట్టారట.
గతంలో బన్నీ మావయ్య చిరంజీవి అడవిదొంగలో ఇలా సింహంతో ఢీ కొట్టే సన్నివేశం బాగా పేలింది. అప్పట్లో ఎలాంటి గ్రాఫిక్స్ లేవు కాబట్టి నిజంగా జంతువుని డూప్ ని వాడి మేనేజ్ చేశారు. అడవిరాముడులో స్వర్గీయ ఎన్టీఆర్ కూ ఇలాంటి ఫైట్ ఉంటుంది. పుష్ప 1లో కథ మొత్తం దట్టమైన అడవిలో జరిగినట్టు చూపించినా ఎక్కడా జంతువులు కానీ వాటి ప్రస్తావన కానీ రాకుండా సుక్కు చాలా తెలివిగా వ్యవహరించాడు. ఇప్పుడు మాత్రం కథ ప్రకారం వాటి అవసరం తప్పలేదట. వచ్చే ఏడాది డిసెంబర్ రిలీజ్ ని టార్గెట్ గా పెట్టుకున్న పుష్ప 2 ది రూల్ అది మిస్ అయితే 2024 సంక్రాంతికి దిగుతుంది
This post was last modified on November 3, 2022 7:01 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…