హీరోగా పెళ్ళిచూపులు సినిమాతో అలరించి.. అర్జున్ రెడ్డితో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించి.. గీతా గోవిందం సినిమాతో భారీ బాక్సాఫీస్ కలక్షన్లు రాబట్టగలనని నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ ఆడకపోయినా కూడా.. ఇప్పటికీ తన క్రేజును మాత్రం అలాగే కొనసాగిస్తున్నాడు. అయితే లైగర్ సినిమా ఫ్లాపైన తరువాత.. ఖుషీ సినిమా ముస్తాబవుతున్నా కూడా.. ఈసారి మాత్రం చాలా కేర్ఫుల్ గా ఒక రొమాంటిక్ కామెడీతో రావాలని యోచిస్తున్నాడట. ఈ తరుణంలో ఒక ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది.
గీత గోవిందం సినిమాను తీసిన దర్శకుడు పరశురాం ఆ తరువాత మహేష్ బాబుతో ‘సర్కారువారి పాట’ అంటూ ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్టయినర్ తో విచ్చేశాడు. సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా.. మహేష్ స్టార్డమ్ వలన భారీ కలక్షన్లు వచ్చేశాయి. కాకపోతే ఈ సినిమా కంటెంట్ చూశాక.. పరశురామ్ తో సినిమా చేయాల్సిన నాగచైతన్య ఈ ప్రాజెక్ట్ పక్కనపెట్టి వెంకట్ ప్రభు సినిమాను లైన్లో పెట్టేశాడు. ఇక పెద్ద హీరోల డేట్స్ లేకపోవడంతో.. మరోసారి విజయ్ దేవరకొండతో చేతులుకలపాలని పరశురాం ఒక ఆసక్తికరమైన కథను తీసుకురాగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాతో జతకట్టాలని యోచిస్తున్నాడట విజయ్. ఓ విధంగా చూస్తే ఇది ‘గీత గోవిందం 2’ అవుతుందని చెప్పాలి.
ఆల్రెడీ గీతా గోవిందం తరువాత డియర్ కామ్రేడ్ సినిమా కోసం విజయ్ అండ్ రష్మిక జంటగా ముందుకొచ్చారు కాని, ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో నిరాశ చెందారు. ఈ మధ్యనే ఇద్దరూ కలసి ‘ఫ్రెండ్స్’ అంటూనే మాల్డీవ్స్ హాలిడేస్ కు వెళ్ళిరావడంతో.. ఈ జంటపై మీడియా అటెన్షన్ మరియు ఆడియన్స్ కి కుతూహలం కూడా బాగా పెరిగింది. చూద్దాం వీళ్ళు నిజంగానే జతకడతారో లేదో మరి.
This post was last modified on November 1, 2022 10:16 pm
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…
కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…