నందమూరి బాలకృష్ణ 107వ సినిమాను ‘వీరసింహారెడ్డి’ అంటూ ఎనౌన్స్ చేసినప్పటినుండి.. సినిమాకు ఒక రేంజులో హైప్ వచ్చేసింది. క్రాక్ ఫేం గోపిచింద్ మలినేని డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో కూడా నిలిపేశారు. అయితే ఈ సినిమాకూ బోయపాటి శ్రీనుకు సంబంధమేంటి అనేదేగా మీ సందేహం? అసలు వీరసింహారెడ్డి సినిమాలో బోయపాటి మార్క్ కనిపించాలని పెద్ద ప్రయత్నమే జరుగుతోంది. పదండి ఆ కహానీ ఏంటో చూద్దాం.
ప్రస్తుతం హైదరాబాదులో ఒక పెద్ద సెట్లో వీరసింహారెడ్డి ఫైట్ సీక్వెన్స్ ఒకటి షూట్ చేస్తున్నారు. క్రాక్ సినిమాలో స్టయిలిష్ ఫైట్లను క్రియేట్ చేసిన డైరక్టర్ గోపిచంద్ మలినేని ఈ సినిమా కోసం కూడా ఒక మాంచి కాన్సెప్టుతో వచ్చాడట. అయితే బాలయ్య మాత్రం.. సినిమాలోని ప్రతీ ఫైట్ కూడా బోయపాటి తరహా ఇంపాక్ట్ తో ఉండాలని సెలవిచ్చారట. దానితో అఖండ సినిమాలో ఫైట్స్ చేసిన ఫైట్ మాస్టర్స్ ను పిలిచి.. బోయపాటి ఫైట్స్ తరహాలో ఒక మాస్ ఫైట్ ను కంపోజ్ చేయించాడట డైరక్టర్. మొత్తానికి బోయపాటి తరహాలో ఫైట్స్ తీస్తూ.. వీరసింహారెడ్డితో అఖండ రికార్డ్స్ బద్దలు కొట్టాలని చూస్తున్నారంటే.. బోయపాటిని టార్గెట్చేసినట్లేగా?
మైత్రి మూవీస్ నిర్మిస్తున్న వీరసింహారెడ్డిలో హీరోయిన్ శృతి హాసన్ కూడా తన అందచందాలతో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఓ రెండు పాటల్లో తన మార్క్ గ్లామర్ డోస్ మరియు డ్యాన్స్ స్టెప్స్ తో అమ్మడు ఆకట్టుకుంటుందట. త్వరలోనే ఒక మాస్ సాంగ్ ను కూడా రిలీజ్ చేద్దామని ఆల్రెడీ డైరక్టర్ గోపిచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఈవెంట్ కోసం శృతి హాసన్ మరియు బాలయ్య స్టేజ్ మీదనే స్టెప్పేసి ఛాన్సుందని తెలుస్తోంది.
This post was last modified on November 2, 2022 7:43 am
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…