దివంగత పునీత్ రాజ్ కుమార్ కు కన్నడ ప్రభుత్వం ఒక బిరుదును కట్టబెడుతున్న తరుణంలో చీప్ గెస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళిన సంగతి. ఇదే ఈవెంటుకు ఇన్ఫోసిస్ సుధామూర్తి కూడా విచ్చేశారు. వీళ్ళందరూ ఏదో ఒక రూపంలో కన్నడ బాషతో నేలతో టచ్ ఉన్నవారే. రజనీ పెరిగింది, కండక్టర్ గా పనిచేసిందీ బెంగుళూరులోనే.
అలాగే సుధామూర్తి ఏకంగా బెంగుళూరు సిలికాన్ వేలీకి ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలి వైఫ్. పైగా కన్నడిగ కూడాను. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తల్లి ద్వారి హాఫ్ కన్నడిగుడే. అందుకే వీళ్ళని ఇన్వయిట్ చేశారనేది వేరేగా చెప్పక్కర్లేదు. ఇకపోతే ఇప్పుడు ఉత్పన్నం అవుతున్న సందేహం ఏంటంటే.. మనం కన్నడ సినిమాలను కన్నడ హీరోలను సొంతం చేసుకున్నట్లు.. అక్కడ కూడా మన ఎన్టీఆర్ ను సొంతం చేసుకుంటారా?
నిజానికి మన బాహుబలి, ఆర్ఆర్ఆర్ అక్కడ కూడా బాగానే ఆడేశాయి కాని.. అందులో సగం కలక్షన్లు కర్ణాటకలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రేక్షుకుల ద్వారా వచ్చినవే. ఇకపోతే కొంతమంది ఈ సినిమాల స్టార్లకు అభిమానులు అయిపోయారు కాని, మన దగ్గర కాంతార సినిమా చూసి రిషబ్ షెట్టికి, కెజిఎఫ్ ద్వారా యశ్ కు అయినంత రేంజులో అభిమానులు అయ్యారా అనేదే సందేహం. ఒకవేళ అదే నిజమైతే.. తనెలాగో హాఫ్ కన్నడవాడే కాబట్టి.. ఎన్టీఆర్ ను సొంతం చేసుకోవాల్సిందే. తదుపరి ఎన్టీఆర్ సినిమాలకు కర్ణాటకలో విపరీతమైన ఆదరణ లభించడమే కాకుండా.. దాదాపు ప్రతీ సినిమా తెలుగు వర్షన్ రేంజులో కన్నడలో కూడా రిలీజవ్వాలి.
ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ కూడా కన్నడ ప్రేక్షకులని తన కన్నడ స్పీచ్ తో బాగా అలరిస్తున్నాడు. తనకు మాతృబాష కావడంతో.. హైదరాబాదులో పెరిగినా కూడా.. కన్నడలో కూడా గుక్కతిప్పుకోకుండా మాట్లాడేస్తున్నాడు. చూద్దాం మరి కన్నడనాట మనోడి తదుపరి సినిమాల ప్రభావం వైభవం ఎలా ఉండబోతుందో.