మూడు సంవత్సరాల తరువాత ఇండియాలోకి అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా అంటూ ఆల్రెడీ బాలీవుడ్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నాయి. ఈ మంగళవారం ఉదయం అమ్మడు ముంబాయ్ ఎయిర్ పోర్టులో దిగబోతోంది అంటూ ఆమె పిఆర్ వర్గాలు ఓ రెండు వారాల నుండి సందడి చేయడం మొదలు పెట్టేరు. అక్కడికేదో దేశానికి తిరిగొచ్చిన నెల్సన్ మండేలా అన్నట్లు ప్రియాంక కోసం కొంతమంది బాలీవుడ్ సీనియర్ జర్నలిస్టులు కూడా ఉదయాన్నే విమానాశ్రయానికి వెళిపోవడం ఇంకా ఆశ్చర్యకరంగానే ఉంది.
ఇదంతా ఒకెత్తయితే.. ఒక ఫోటోగ్రాఫర్ కమ్ జర్నలిస్ట్ మాత్రం.. తన ప్రశ్నతో ప్రియాంకకే షాకిచ్చాడు. ప్రియాంక ఎదురుపడగానే.. ఆలియా భట్ మమ్మీ అవుతోంది.. దీనిపై మీ కామెంట్ ఏంటి అని అడిగాడు సదరు జర్నలిస్ట్. నవ్వేసి వెళ్ళిపోయింది ప్రియాంక. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ కావడంతో.. ఇదేం నాసిరకం జర్నలిజం అంటూ ఇప్పుడు నెటిజన్లందరూ మండిపడుతున్నారు. కాకపోతే విషయం ఏంటంటే.. విమానాశ్రయంలో కనిపించిన ప్రియాంకను అసలు ఏం ప్రశ్నలు అడగాలి, ఏమని అడుగుతాం అనేది జర్నలిస్టులకు కూడా క్లిష్టమైన అంశమే. ఒకవేళ ప్రియాంక కూడా కంగనా రనౌత్ తరహాలో రాజీకయపరమైన కామెంట్లు చేయడంలో దిట్టయితే.. ఖచ్చితంగా ప్రపంచ స్థితిగతుల మీద ప్రశ్నల వర్షం కురిపించవచ్చు. ప్రియాంక కేవలం సినిమాల గురించే ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి.. వాళ్ళు మాత్రం ఏం ప్రశ్నలు సందిస్తారు చెప్పండి?
అంతేకాకుండా.. ఒక ప్రక్కన ఫుల్ ఫామ్ లో వరుస సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ఆలియా భట్ సొంతంగా తల్లి అవుతుంటే.. ప్రియాంక మాత్రం అద్దె గర్భంతో సరోగసీ రూట్లో మమ్మీ అయిపోయింది. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ కారణంగా అలా చేసినా కూడా.. ఇప్పుడు ఆలియా గురించి కామెంట్ చేస్తే.. నువ్వెందుకు సరోగసీకి వెళ్ళావ్.. నీ అందచందాలు పాడైపోకూడదనా అనే ప్రశ్న కూడా ఆమెను అడిగే ఛాన్సుంది. మేబీ అందుకే నవ్వేసి వెళిపోయింది కాబోలు అంటూ ఇప్పుడు కొన్ని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయిలే.
This post was last modified on November 1, 2022 10:16 pm
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…