వచ్చే సంక్రాంతి పోటీలో ఊహించని విధంగా అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ వచ్చి చేరింది. ఆదిపురుష్ రిలీజ్ వాయిదా పడనుందనే సమాచారంతో ఆ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపారు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలేమి లేవు. టీజర్ బాగున్నా చివర్లో వీడియో గేం ను తలిపించిందనే కామెంట్స్ అందుకుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్, అఖిల్ లుక్స్ కూడా పెద్దగా హాట్ టాపిక్ అవ్వలేదు.
నిజానికి ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెడుతున్నారని , అఖిల్ మార్కెట్ కి మించి రెండింతలు ఖర్చు చేస్తున్నారని టాక్ ఉంది. సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం భారీ సెట్స్ , అబ్రోడ్ షూట్ ఇలా చాలానే అడుగుతున్నాడు. ముందుగా వేసుకున్న బడ్జెట్ ఎప్పుడో దాటేసిందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి , అఖిల్ ఇద్దరూ నిర్మాతలుగా పార్ట్ అవుతున్నారట. ఇద్దరూ రెమ్యునరేషన్ లేకుండా పనిచేస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికే సురేందర్ రెడ్డి బేనర్ పేరు పోస్టర్ పై పడింది. అఖిల్ మాత్రం రిలీజ్ తర్వాతే తనకి రెమ్యునరేషన్ ఇవ్వమని నిర్మాతకి చెప్పి ఈ ప్రాజెక్ట్ సైన్ చేశాడట. ఏదేమైనా సంక్రాంతికి వస్తున్న వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలకు భారీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మరి వీటి మధ్యలో రాబోతున్న అఖిల్ సినిమాకు ఇంకా భారీ ప్రమోషన్స్ అవసరం. ఇప్పటి వరకూ సినిమాకు భారీ హైప్ ఏమి రాలేదు. ట్రైలర్ నుండి అయినా ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయేమో చూడాలి. ఏదేమైనా ఏజెంట్ కి గట్టి ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. లేదంటే ఆడియన్స్ సంక్రాంతి బరిలో ఈ సినిమాను పట్టించుకోరు.
This post was last modified on October 31, 2022 1:05 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…