నిత్యం ఎదో ఒక సెన్సేషనల్ కామెంట్ తో సోషల్ మీడియాలో హంగామా చేసే వ్యక్తుల్లో దర్శకుడు తేజ ఒకరు. సినిమా షూటింగ్ పూర్తయ్యేదాకా మీడియా కి దూరంగా ఉండే తేజ సినిమా రిలీజ్ కి ముందు మాత్రం రెగ్యులర్ గా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. అందులో ఎదో ఒక టాపిక్ మీద సెన్సేషనల్ కామెంట్ చేయడం తేజ నైజం.తాజాగా తేజ హీరో దగ్గుబాటి అభిరామ్ పై కామెంట్ చేశారు. దగ్గుబాటి కుటుంబం నుండి అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. తేజ అహింస అనే సినిమాతో అతన్ని పరిచయం చేస్తున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో దగ్గుబాటి అభిరామ్ ను డెబ్యూ హీరో అంటూ జర్నలిస్ట్ సంబోధించడం తేజ కి నచ్చలేదు. వెంటనే అతన్ని డెబ్యూ హీరో అని ఎలివెట్ చేయొద్దు. నా కథలో ఉన్న 20 కేరెక్టర్స్ లో అభిరామ్ కూడా ఒక కేరెక్టర్ అంతే అంటూ చెప్పుకున్నాడు. ఇక నేను ఉదయ్ కిరణ్, నితిన్ ను పరిచయం చేసినప్పుడు ఏమైనా గట్టిగా చెప్పుకున్నామా ? లేదు కదా మరి ఇతన్ని ఎందుకు మీరు అలా పోలుస్తూ ఎక్ట్రా చేస్తున్నారు… ? అతన్ని మామూలుగానే చూడండి అంటూ కామెంట్ చేశాడు. నేను అనుకున్న ఓ మంచి కథ అందులో ఇతను సరిపోయాడు అంతే… అన్నాడు. అలాగే అభిరామ్ తో సినిమా చేయడానికి మెయిన్ రీజన్ రామానాయుడు గారని , ఆ విషయం రిలీజ్ కి ముందు తప్పకుండా చెప్తానని తెలిపాడు. సినిమాలో 16 యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు అన్ని ఉంటాయని, మాస్ మసాలా మూవీగా తెరకెక్కింది అన్నాడు.
అలాగే అహింస లో జయం పోలికలు ఉన్నాయనే కామెంట్ పై కూడా తేజ స్పందించాడు. కొత్త కథలేం ఉండవు, మొత్తం 14 కథలే ఉంటాయి చెప్పే స్టైల్ మారుద్ది తప్ప అంటూ అహింసతో తను చెప్పాలనుకుంటున్న కథ గురించి డీటైల్ గా చెప్పుకొచ్చాడు తేజ. ఎవరేమనుకున్నా..ఏదేమైనా కొందరు ఇండస్ట్రీలో చాలా నిఖర్చుగా మాట్లాడతారు. ఆ కోవలోకి వచ్చే అతి కొద్ది మందిలో తేజ ఒకరు. మరి దగ్గుబాటి అభిరామ్ హీరో కాదంటూ, తను జస్ట్ కథలో ఓ పాత్ర మాత్రమే అంటూ ఇంత డేరింగ్ గా చెప్పడం తేజ కే చెల్లింది.
This post was last modified on October 31, 2022 10:59 am
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…