రీమేక్ సినిమాల పట్ల నానాటికీ ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతోందన్న విషయం ఎప్పటికప్పుడు రుజవవుతూనే ఉంది. కానీ టాలీవుడ్ మాత్రం పరభాషా చిత్రాల మీద మోజు తగ్గించుకోవట్లేదు. మాతృకను చెడగొట్టకుండా ఉన్నదున్నట్లు తీసినా.. కొన్ని మార్పులు చేర్పులు చేసి, కొంచెం మసాలా అద్ది మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు తీర్చిదిద్దినా.. ఇలా ఏం చేసినా పెద్దగా ఫలితం లేకపోతోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రీమేక్ సినిమాలు కూడా ప్రతికూల ఫలితాన్నే అందుకుంటున్నాయి.
ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్‌కు ఎంత మంచి టాక్ వచ్చిందో తెలిసిందే. వకీల్ సాబ్ తరహాలోనే దీన్ని కూడా మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చి బాగానే తీర్చిదిద్దారు. కానీ మామూలుగా పవన్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది. కానీ ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది.
ఇక దసరా కానుకగా ఈ నెలలోనే రిలీజైన గాడ్ ఫాదర్ సంగతి తెలిసిందే. ఆ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు బాగానే మార్చాడు దర్శకుడు మోహన్ రాజా. కానీ దసరా సెలవుల్లో పోటీగా వచ్చిన సినిమాలు తుస్సుమన్నా కూడా గాడ్ ఫాదర్ ఈ అడ్వాంటేజీని పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది. తొలి వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టి ఆ తర్వాత చల్లబడిపోయింది. ఫైనల్‌గా చూస్తే ఆ సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి.
ఇక తాజాగా ఓరి దేవుడా అనే మరో రీమేక్ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్లంతా బాగుందన్నారు. రివ్యూలు బాగున్నాయి. తీరా చూస్తే వసూళ్లు లేవు. కాంతార, సర్దార్ సినిమాల జోరు ముందు ఇది నిలవలేకపోయింది. తొలి రోజు నుంచి ఓ మోస్తరు వసూళ్లే వచ్చాయీ సినిమాకు. వీకెండ్ తర్వాత సినిమా ప్రభావం అంతంతమాత్రమే. ఓటీటీల పుణ్యమా అని అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్న ఈ రోజుల్లో రీమేక్ సినిమాలు ఇకపై అంతగా వర్కవుట్ కావడానికి ఇది తాజా హెచ్చరిక.
This post was last modified on October 31, 2022 12:43 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…