ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం రిలీజైన సినిమా. దానికి కొనసాగింపు వస్తోంది. అప్పట్లో అది ఎంత పెద్ద వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అయినా కావొచ్చు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా క్రేజ్ చెక్కుచెదరలేదు సరికదా రెట్టింపు కావడం తలలు పండిన విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఇండియాలో జరుగుతున్న బిజినెస్, నిర్మాతలు అడుగుతున్న రేట్లు ట్రేడ్ లో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక్క తెలుగు వెర్షన్ నుంచే 100 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారనే వార్త హాట్ హాట్ టాపిక్ గా మారింది. ఇంత మొత్తం షేర్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి మల్టీమిలీనియం స్టార్లకే అంత సులభంగా రాదు ఇండస్ట్రీ హిట్ అయితే తప్ప.
అలాంటిది ఒక హాలీవుడ్ మూవీకి ఇంత పెట్టుబడంటే బయ్యర్లు ఆలోచించాల్సిన విషయమే. సరే మిగిలిన బాషల సంగతి చూస్తే ఓవరాల్ గా ఆరు వందల కోట్లకు పైగానే నిర్మాణ సంస్థ ఆశిస్తున్నట్టు సమాచారం. ఆ టైంలో ఎవరూ పోటీకి దిగేందుకు సాహసించడం లేదు. డిసెంబర్ 16న అవతార్ 2 వస్తుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా కొత్త రిలీజులు డిసెంబర్ 23న ప్లాన్ చేసుకున్నాయి. ఫేస్ టు ఫేస్ జేమ్స్ క్యామరూన్ తో తలపడేందుకు రెడీగా లేవు. అంత ఇంపాక్ట్ ఉంది మరి. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల సునామిని తట్టుకోవడం కష్టమని అంచనా వేస్తున్నారు.
దీని కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ ని రినోవేట్ చేస్తున్నారంటేనే హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఫలితం మీదే 2024, 2026లో రాబోయే మిగిలిన రెండు భాగాల బజ్ ఆధారపడి ఉంది. ఇదే కాదు పలు నగరాల్లో కొత్త మల్టీప్లెక్సులు అవతార్ 2తో ప్రారంభోత్సవం జరుపుకోవాలని డిసైడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన భాషల్లో అనువదించబోతున్నారు. మరి వంద కోట్ల పందేనికి మన ఎగ్జిబిటర్లు సిద్ధపడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడేమో కానీ ఉత్తరాదిలో మాత్రం అవతార్ 2 ఫీవర్ ఓ రేంజ్ లో ఉంది.
This post was last modified on October 31, 2022 9:46 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…