అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబో సినిమా వీర సింహా రెడ్డి షూటింగ్ పూర్తి ఫస్ట్ కాపీ చేతికి రావాలి. కానీ ఇంకా కొంత వర్క్ తో యూనిట్ పరుగులు పెడుతుంది. నిజానికి ఈ సినిమాకు సంబంధించి దాదాపు మొన్నటి వరకూ అన్ని షెడ్యుల్స్ సవ్యంగా జరిగిపోయాయి. కానీ ఫైనల్ షెడ్యుల్ మాత్రం బ్రేకులతో ముందుకు సాగడం లేదు.
బాలయ్య ఫైనల్ షెడ్యుల్ కోసం సెప్టెంబర్ లో కొన్ని , అక్టోబర్ లో మరికొన్ని డేట్స్ ఇచ్చాడు. కానీ అదే సమయంలో ఆహాకి బాలయ్య అన్ స్టాపబుల్ షూట్ కారణంగా వీర సింహా రెడ్డి షూట్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత బాలయ్య ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ కోసం యాడ్ షూట్ చేశాడు. దానికి నాలుగైదు రోజులు తీసుకున్నారు. ఇక అన్ స్టాపబుల్ ప్రోమో షూట్ కోసం కూడా మధ్యలో కొన్ని డేట్స్ ఇచ్చాడు బాలయ్య.
ఇలా ఆహా కోసం కొన్ని రోజులు యాడ్ షూట్ మరికొన్ని రోజులు కేటాయించడంతో వీర సింహా రెడ్డి షూటింగ్ బ్రేక్ పడింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యుల్ మొదలు పెట్టి ఫాస్ట్ గా షూట్ చేసే పనిలో ఉన్నారు. నవంబర్ ఎండింగ్ వరకూ షూట్ కంప్లీట్ చేసేసి డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకునేందుకు టీం ప్లాన్ చేసుకుంటున్నారు. నవంబర్ నుండి భారీ ఎత్తున ప్రమోషన్స్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నారు.
This post was last modified on October 29, 2022 5:39 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…