Movie News

‘భోళాశంకర్‌’కు ‘బిల్లా’తో పోలిక

శక్తి, షాడో లాంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత మెహర్ రమేష్ చాలా ఏళ్ల పాటు ఖాళీగా ఉండిపోయాడు. అతడికి అవకాశం ఇవ్వడానికి నిర్మాతలు, హీరోలెవరికీ ధైర్యం చాల్లేదు. ఇక మెహర్ రమేష్ మళ్లీ మెగా ఫోన్ పట్టి ఓ సినిమా తీయడం కష్టమే అని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. అతను కూడా అలాంటి ప్రయత్నాలేమీ చేస్తున్నట్లు కనిపించలేదు.

కానీ కరోనా టైంలో తన పేరిట చేపట్టిన సహాయ కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకోవడమే కాక.. అనేక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి వాటిని కూడా కొన్నేళ్లుగా పర్యవేక్షిస్తున్న మెహర్‌కు తన వంతుగా ఏదైనా సాయం చేయాలని భావించి ‘వేదాళం’ రీమేక్‌ బాధ్యతను అతడికి అప్పగించాడు చిరు. రీమేక్ కాబట్టి మరీ కంగారు పడాల్సిన పని లేదని చిరు భావించి ఉండొచ్చు. దారుణమైన ట్రాక్ రికార్డున్న మెహర్‌కు అవకాశం ఇవ్వడాన్ని అభిమానులు వ్యతిరేకించినా చిరు పట్టించుకోలేదు.

ఐతే మెహర్ మాత్రం ‘భోళా శంకర్’ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అభిమానులు బాగా ఎంజాయ్ చేసే మాస్ ఎంటర్టైనర్ ఇదని మెహర్ ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘భోళా శంకర్’కు, తాను తీసిన హిట్ మూవీ ‘బిల్లా’కు అతను పోలిక పెట్టాడు. ‘బిల్లా’ ఒరిజినల్లో అజిత్ హీరోగా నటించాడని.. ‘భోళా శంకర్’ ఒరిజినల్ ‘వేదాళం’లోనూ అజితే హీరో అని మెహర్ చెప్పాడు.

‘బిల్లా’ సినిమా థీమ్ మాత్రమే తీసుకుని మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసినట్లే.. ‘వేదాళం’ సినిమాకు కూడా చేశామని మెహర్ తెలిపాడు. ఇప్పటికి 40 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. సినిమా చాలా బాగా వస్తోందని.. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అతను వెల్లడించాడు.చిరు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రాన్ని సీనియర్ నిర్మాత కేఎస్ రామారావుతో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.

This post was last modified on October 28, 2022 9:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

11 hours ago