రేణు దేశాయ్.. పెళ్లి గోల‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి రేణు దేశాయ్ విడిపోయి చాలా ఏళ్ల‌యింది. కానీ ఇప్ప‌టికీ తెలుగు జ‌నాల్లో ఆమె పేరు చ‌ర్చ‌నీయాంశ‌మే. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇప్ప‌టికీ ఆమెను వ‌దిన అని పిలుస్తుంటారు. ఐతే రెండేళ్ల కింద‌ట వాళ్లంద‌రికీ షాకిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది రేణు. ఓ వ్య‌క్తితో నిశ్చితార్థం కూడా చేసుకుని దానికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేసింది. కానీ ఆ వ్య‌క్తి ఐడెంటిటీని మాత్రం బ‌య‌ట‌పెట్ట‌లేదు. అస‌లు నిశ్చితార్థం త‌ర్వాత రేణు పెళ్లి జ‌రిగిందా లేదా అన్న విష‌యంలోనూ స్ప‌ష్ట‌త లేదు. ఎంగ్మేజ్మెంట్ గురించి అప్ డేట్ ఇచ్చిన రేణు.. పెళ్లి గురించి మాత్రం ఏ స‌మాచారం పంచుకోలేదు. దీంతో ఇప్ప‌టికీ స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. చ‌ర్చ ఆగ‌ట్లేదు.

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ రేణును రెండో పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నార‌ట నెటిజ‌న్లు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో రేణుకు పెళ్లి గురించి ప్ర‌శ్న‌లే ఎదుర‌య్యాయ‌ట‌. దీనిపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో రేణు ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించింది. అందరూ నా పెళ్లి గురించే అడుగుతున్నారు. వాళ్లకి నేను పెళ్లి చేసుకున్నా ఇబ్బందే.. చేసుకోకపోయినా ఇబ్బందే. పెళ్లికి సంబంధించిన ప్రశ్నలతో విసిగిపోయాను. ఈ సందేహాలన్నింటికీ సమాధానంగా ఓ సినిమా చేస్తాను. దానికిపెళ్లి గోలఅనే టైటిల్ పెడతాను అని రేణు సరదాగా అంది. ఇంతా మాట్లాడిన రేణు.. త‌న‌కు రెండో పెళ్లి జ‌రిగిందా లేదా అనే విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అలా ఇచ్చే ఉద్దేశం కూడా ఆమెకున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు.