తెలుగు ఓటిటి యాప్ లో బాగా ఇంట్రస్టింగ్ గా ఉన్ని సినిమాలు కాని సిరీస్ లు కాని ఏంటి అని ఎవరినైనా అడిగితే.. ముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేది డబ్బింగ్ సినిమాలే. చాలామంచి తమిళ, మలయాళం సినిమాలను మనోళ్లు డబ్బింగ్ చేసి తెలుగులో సదరు ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే కాంతారా సినిమా తరువాత హీరో రిషబ్ షెట్టికి బాగా క్లోజ్ అయిన అల్లు అరవింద్ ఇప్పుడు ఆహా కోసం కాంతారాతో కలిపి ఒక మంచి డీల్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
ఆల్రెడీ కాంతారా సినిమాను ఒక పెద్ద ఓటిటికి ఇచ్చేసినా కూడా.. హొంబాలే ఫిలింస్ సంస్థ ఇప్పుడు మరో డీల్ కోసం యత్నిస్తోందని టాక్. ఈ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్.. కాంతారా తెలుగు వర్షన్ ను ‘ఆహా’కు కూడా ఇచ్చేలా సెట్ చేస్తున్నారట. అంతేకాకుండా.. ఈ సినిమా సక్సెస్ తో రిషబ్ షెట్టికి బాగా ఫేం వచ్చేయడంతో.. ఆ హీరో నటించిన కన్నడ సినిమాలన్నింటినీ ఇప్పుడు డబ్బింగ్ చేసిన ఆహాలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారట.
ఆల్రెడీ రిషబ్ చేసిన బెల్ బాటమ్ సినిమా తెలుగులో బాగానే ఎక్కేసింది. అది కూడా ఆహాలోనే ఉంది. ఇప్పుడు ఆ సినిమాను చూస్తే.. అరే అందరూ కాంతారా సినిమాలో ఉన్న యాక్టర్లే ఉన్నారే అనుకుంటారు. అందుకే రిషబ్ ఇతర సినిమాల తాలూకు రైట్స్ కూడా వేర్వేరు ప్రొడ్యూసర్ల దగ్గర నుండి తీసుకునే పనిలోపడింది ఆహా యాప్. మొత్తానికి ఇలాంటి డీల్స్ సెట్ చెయ్యాలంటే అల్లు అరవింద్ తనకు తానే సాటిలే.
ఇకపోతే తెలుగు బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తున్న కాంతారా సినిమా.. తెలుగులో ఆల్రెడీ ₹30 కోట్ల్ గ్రాస్ వసూలు చేయగా.. బాలీవుడ్లో కూడా దాదాపు ₹30కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అనస్టాపబుల్ గా సాగుతున్న కాంతారా దాదాపు వరల్డ్ వైడ్ అన్ని బాషల్లోనూ కలిపి ₹200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు సెలవిస్తున్నాయి.