గత నెల సెప్టెంబర్ 30న భారీ ఎత్తున విడుదలైన పొన్నియన్ సెల్వన్ 1 ఓటిటిలో వచ్చేసింది. ఎలాంటి ప్రమోషన్ హడావిడి లేకుండా అమెజాన్ ప్రైమ్ లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. ఇప్పటికిప్పుడు దీన్ని చూసేయాలంటే 199 రూపాయలు చెల్లించాలి. మాకు మెంబెర్ షిప్ ఉందంటే మాత్రం ఇంకో వారం ఆగి నవంబర్ 4 నుంచి ఉచితంగా చూసుకోవచ్చు. డబ్బులు కట్టేసి అంత కొంపమునిగిపోయేలా చూసేంత ఉద్దేశంలో తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఉండరు కానీ థియేటర్ లో మిస్ అయిన అరవ ఆడియన్స్ ఈ ఖర్చుకు వెనుకాడకపోవచ్చు.
గతంలో కెజిఎఫ్ 2నూ ఇదే తరహాలో పే అండ్ సీ మోడల్ ను అమలుపరిచిన ప్రైమ్ గత ఆరేడు నెలల నుంచి బాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ కి ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. డెబ్భై రూపాయలతో మొదలుపెట్టి మూడు వందల దాకా రకరకాల ధరలతో కొత్త కంటెంట్ ఇస్తోంది. ఇది అమెరికా లాంటి దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం మెల్లగా అలవాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నాలుగు వందల కోట్ల వసూళ్లు తెచ్చుకుందని తమిళ మీడియా తెగమోసిన పీఎస్ 1 ఊహించని విధంగా ఇంత త్వరగా డిజిటల్ ప్రీమియర్ గా రావడం మాత్రం అనూహ్యమే.
బ్లాక్ బస్టర్లు సైతం ఇలా నాలుగు వారాలకే వస్తే ఎలా అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఒకపక్క నిర్మాతలు థియేటర్ కు ఓటిటికి మధ్య కనీసం రెండు నెలల గ్యాప్ ఉండాలని నిర్దేశించుకుంటున్న టైంలో ఇలా చేయడం చూస్తే ఎవరిని తప్పుబట్టాలో అర్థం కాని పరిస్థితి. తెలుగులో బ్రేక్ ఈవెన్ టచ్ చేయడానికే చాలా కష్టపడ్డ పొన్నియన్ సెల్వన్ 1 ఒరిజినల్ వెర్షన్ లో మాత్రం మణిరత్నం కంబ్యాక్ స్థాయిలో వసూళ్లు తెచ్చుకుంది. ఎలా చూసినా ప్యాన్ ఇండియా లెవెల్ లో బాహుబలి, కెజిఎఫ్, పుష్ప రేంజ్ లో సీక్వెల్ మీద హైప్ ని తెచ్చుకోవడంలో ఫెయిలైన మాట వాస్తవం
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…