అభిమానులను కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచేస్తూ కాలం చేసి నెలలు గడుస్తున్నా శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి జ్ఞాపకాలు మాత్రం సినిమాల రూపంలో ఇంకా వస్తూనే ఉన్నాయి. నిజానికి తన చివరి చిత్రంగా జేమ్స్ ని ప్రమోట్ చేశారు కానీ ఆ తర్వాత కూడా మరో రెండు థియేటర్లలో రావడం విశేషం. అందులో మొదటిది లక్కీ మ్యాన్. ఇటీవలే విశ్వక్ వెంకటేష్ ల కాంబోలో వచ్చిన ఓరి దేవుడాకు కన్నడ రూపం. ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు కానీ పునీత్ ని చూసుకుని ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇప్పుడు ఆఖరి నివాళికి సమయం వచ్చింది.
అడవిలో అడ్వెంచర్ రూపంలో పునీత్ చేసిన సాహసాన్ని గంధధగుడి పేరుతో రేపు విడుదల చేయబోతున్నారు. ఇది డాక్యుమెంటరీ తరహాలో సాగే థ్రిల్లర్. అటవీ పర్యావరణాన్ని చిత్రీకరించడంలో అశేమైన పేరు ప్రఖ్యాతులున్న అమోఘవర్ష జెఎస్ దర్శకత్వం వహించారు. దీనికి సంబంధించి మరికొన్ని విశేషాలున్నాయి గంధద గుడి టైటిల్ తో పునీత్ తండ్రి డాక్టర్ రాజ్ కుమార్ 1973లో ఒక సినిమా చేశారు. అది ఆ సమయంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్. రికార్డు వసూళ్లు దక్కించుకుంది. దశాబ్దాల తరబడి కల్ట్ క్లాసిక్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఎన్టీఆర్ అడవి రామడుకి ప్రధాన స్ఫూర్తి ఈ చిత్రమే.
దీనికి కొనసాగింపుగా 1995లో పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ ఓ చిత్రం చేశారు. అదీ హిట్టే. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తన చివరి చూపుకు అదే గంధద గుడిని ఎంచుకోవాల్సి రావడం కాకతాళీయం. రేపు ఇది భారీ ఎత్తున విడుదల కానుంది. ఒక రోజు ముందే ఇవాళ బెంగళూర్ లాంటి నగరాల్లో స్పెషల్ ప్రీమియర్లు వేస్తుంటే దాదాపు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఫుల్ అయిపోయే పరిస్థితి ఉంది. చాలా చిన్న వయసులోనే కన్నుమూసిన పునీత్ కు ఇన్ని నెలల తర్వాత కూడా ఈ స్థాయిలో ఆదరణ దక్కడం చూస్తుంటే భాషతో సంబంధం లేకుండా అతనెంత పునీతుడో అర్థమవుతోంది.
This post was last modified on October 27, 2022 12:38 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…