Movie News

బైలింగ్వెల్ కాదు ..డైరెక్ట్ తమిళ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి , తెలుగు నిర్మాత దిల్ రాజు ‘వారసుడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ఈ సినిమాకు వరిసు అనే టైటిల్ పెట్టుకున్నారు. ముందు నుండి ఈ సినిమా విషయంలో అందరికీ ఓ సందేహం ఉంది. ఇది తమిళ్ సినిమానా ? లేక బైలింగ్వెల్ సినిమానా ?. తాజాగా ఈ డౌట్ కి క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ వంశీ.

తాజాగా కోలీవుడ్ మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు వంశీ పైడి పల్లి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఇది బైలింగ్వెల్ ఆ? లేక తమిళ్ సినిమానా ? అని అడిగేశాడు. ఆ ప్రశ్నకు ఎక్కువ ఆలోచించకుండా ప్రాపర్ తమిళ్ సినిమానే ఏంటి అలా అడుగుతావ్ అన్నట్టుగా వంశీ తమిళ్లో రియాక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూ అంతా తమిళ్ లో జరిగింది. వంశీ తమిళ్ లో బేషుగ్గా మాట్లాడుతూ సమాధానాలు ఇచ్చాడు.

అలాగే విజయ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాడు. ప్రతీ రోజు ముందు రోజు రాత్రి ఇంట్లో సీన్స్ హోం వర్క్ చేసుకుంటాడని , షాట్ పెట్టే ముందు కూడా ప్రిపేర్ అవుతాడని తనలో అది బెస్ట్ క్వాలిటీ అన్నట్టుగా చెప్పాడు. ఒక కుటుంబం, అందులో వారసుడు ఇదే బేస్ లైన్, కానీ విజయ్ ఫ్యాన్స్ ఏమేమో కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉంటాయని తెలిపాడు. యాంకర్ సినిమాకు సంబంధించి ఇంకా కొన్ని విషయాలు అడుగుతుంటే అవన్నీ ఇప్పుడే చెప్తే దిల్ రాజు ఊరుకోరు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఏదేమైనా దర్శకుడే ఇది తమిళ్ సినిమా అంటూ అఫీషియల్ గా చెప్పేశాడు కాబట్టి ‘వారసుడు’ సినిమాను తెలుగులో డబ్బింగ్ సినిమాగానే పరిగణించాలి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ డబ్బింగ్ మూవీతో విజయ్ తెలుగులో ఎంత కలెక్ట్ చేస్తాడో చూడాలి.

This post was last modified on October 26, 2022 3:09 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

26 minutes ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

1 hour ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

2 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

4 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

6 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

7 hours ago