ఏయ్ టిల్లూ.. ట్యాగ్ పెట్టేసుకున్నావా!

ఒక్క సినిమా హిట్టయితే చాలు.. ఆటోమ్యాటిక్ గా అందులో ఉన్న హీరో బిజీ హీరో అయిపోతున్నాడు. కాకపోతే ఒకప్పటిలా.. చాలామంది హీరోలు.. వరుసపెట్టి హిట్లిచ్చి బాక్సాఫీస్ దగ్గర సత్తా మాత్రం చాటలేకపోతున్నారు. అందుకే ఈ మద్యన చాలామంది హ్యాపెనింగ్ హీరోలకు సూపర్ స్టార్ బంపర్ స్టార్ అంటూ ఎటువంటి ట్యాగులూ ఇవ్వట్లేదు. అందుకే అటు విజయ్ దేవరకొండకైనా.. ఇటు విశ్వక్సేన్ అయినా.. ట్యాగ్స్ ఏమీ లేవు. కాని మరో యంగ్ హీరో మాత్రం ఇప్పుడు ఒక ట్యాగ్ తగిలించుకుని కాస్త షాకిచ్చాడంతే.

‘స్టార్ బాయ్’ సిద్దూ అంటూ ఇప్పుడు “టిల్లూ స్క్వేర్” పోస్టర్ మీద కొత్త ట్యాగ్ తో పలకరించాడు డిజె టిల్లు ఫేం సిద్దూ జొన్నలగడ్డ. టిల్లు సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా, లేదంటే ఆ సినిమాలో మనోడు క్యారక్టర్ అటువంటిది ప్లే చేశాడు కాబట్టా.. అసలు స్టార్ బాయ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడో మాత్రం తెలియట్లేదు. లేదంటే కొత్తగా స్టార్ అయిపోయిన బాయ్ కాబట్టి ‘స్టార్ బాయ్’ అనేసుకుంటున్నాడా అనేది కూడా చూడాల్సిన విషయమే. ఏదేమైనా కూడా.. ఒకప్పుడు డైరక్టర్లూ ప్రొడ్యూసర్లూ ఇలా హీరోలకు ట్యాగ్స్ తగిలించేవారు. ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్లు కూడా కొన్ని సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం హీరోలే ట్యాగ్స్ పెట్టుకోవడం కాస్త కొత్తగానూ విడ్డూరంగానూ కూడా ఉందిలే.

అదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు తన సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతోంది అంటూ టిల్లూ స్క్వేర్ కోసం సిద్దూ చేసిన హడావుడి మాత్రం బాగుంది. కాకపోతే హీరోయిన్ అనుపమా పరమేశర్వన్ అంటూ వీడియోలో చెప్పేశారు కాబట్టి, ఆమెను కూడా చూపించుంటే బాగుండేదని అంటున్నారు ఆడియన్స్. ఇకపోతే స్టార్ బాయ్ అంటూ ట్యాగ్ వేసుకున్నాడు కాబట్టి.. ఈ సీక్వెల్ తో కూడా మనోడు గట్టిగానే హిట్టు కొట్టాలి. ఏ కొంచెం తేడా వచ్చినా కూడా ఆ ట్యాగ్ పట్టుకుని ట్రోలింగ్ చేసే బ్యాచ్ లో మనోడు బలైపోతాడంతే.