యువ నటుడు సత్యదేవ్ ఏ సినిమా చేసినా.. అతడి నటన గురించి తప్పకుండా ప్రశంసలు వస్తాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అతడి నటనను మాత్రం అందరూ కొనియాడుతారు. ఇటివలే మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్‌లో విలన్ పాత్రతో సత్యదేవ్ వావ్ అనిపించాడు. చిరు ముందు అతను విలన్ ఏంటి అని విడుదలకు ముందు అన్న వాళ్లు కూడా రిలీజ్ తర్వాత సినిమాకు సత్యదేవ్ పాత్ర, అతడి నటనే హైలైట్ అన్నారు. ఈ టాలెంటెడ్ యాక్టర్ బాలీవుడ్లోనూ ఓ పెద్ద సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు.
అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రమే.. రామ్ సేతు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ దీపావళి కానుకగా మంగళవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది.
పురాణాలకు మాత్రమే పరిమితం అయిన రామసేతుకు సంబంధించిన ఆధారాలను కనుగొని అది నిజంగానే ఉంది అని చాటి చెప్పే ప్రయత్నంతో సాగే ఈ సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కాన్సెప్ట్ బాగున్నా.. ప్రథమార్ధం వరకు ఆసక్తికరంగా సాగినా సినిమా ఓవరాల్‌గా మెప్పించలేదని.. రెండో అర్ధం నుంచి గాడి తప్పిన సినిమా చివరికి నిరాశను మిగిల్చిందని అంటున్నారు. ఐతే సినిమా విషయంలో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. సత్యదేవ్ పాత్ర, నటన విసయంలో మాత్రం ప్రశంసలు జల్లు కురుస్తోంది.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సత్యదేవ్ సూపర్ అనే అంటున్నారు. ఫుల్ లెంగ్త్‌లో సాగే అక్షయ్ కుమార్ పాత్ర కంటే సత్యదేవ్ క్యారెక్టర్, అతడి నటనే బాగున్నాయని అంటున్నారు. మొత్తానికి సినిమా ఎలా ఉన్నప్పటికీ.. తనవరకు హైలైట్ అయ్యే ట్రెండుని సత్యదేవ్ కొనసాగిస్తున్నాడన్నమాట. ఈ సినిమాతో వచ్చిన పేరుతో బాలీవుడ్లో సత్యదేవ్ మరిన్ని అవకాశాలు దక్కించుకుంటాడేమో చూడాలి.
This post was last modified on October 25, 2022 10:06 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…