Adipurush
Prabhas అభిమానుల దృష్టంతా ఇప్పుడు ఆదిపురుష్ మీదే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్ ఒకదాన్ని మించి ఒకటి నిరాశ పరచడంతో అభిమానుల ఆశలన్నీ ఆదిపురుష్ మీదే ఉన్నాయి. కానీ ఇటీవలే రిలీజైన ఆ సినిమా టీజర్ నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
అందులో విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు రావణుడు, హనుమంతుడు పాత్రల లుక్స్, అప్పీయరెన్స్ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఓం రౌత్ అండ్ టీం మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నట్లే చిత్ర బృందం నుంచి సంకేతాలు వచ్చాయి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సంక్రాంతికి ఆదిపురుష్‌ను రిలీజ్ చేయడం కరెక్టేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Adipurush ఎంత బాలీవుడ్ మూవీ అయినా.. ఆ సినిమాకు మేజర్ వసూళ్లు వచ్చేది తెలుగు రాష్ట్రాల నుంచే. ప్రభాస్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. కానీ సంక్రాంతికి తెలుగులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి మాస్ మసాలా సినిమాలు రిలీజవుతున్నాయి. దీనికి తోడు విజయ్ డబ్బింగ్ మూవీ వారసుడు కూడా విడుదలవుతోంది.
ఈ సినిమాలు ఎలా ఉంటాయి.. ఎంత వసూళ్లు రాబడతాయన్నది పక్కన పెడితే.. వాటి కోసం చాలా థియేటర్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆదిపురుష్ లాంటి భారీ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో సోలోగా రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పోటీ లేకుంటేనే ఇలాంటి భారీ చిత్రానికి మంచిది.
తక్కువ థియేటర్లలో పోటీ మధ్య రిలీజ్ చేస్తే అటు ఇటు అయితే బయ్యర్లు దారుణంగా దెబ్బ తింటారు. ఈ నేపథ్యంలో సినిమాను సంక్రాంతి కంటే ముందో, వెనుకో రిలీజ్ చేయడంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రం జనవరి 12నే రిలీజ్ అని కన్ఫమ్ చేశారు. మరి చివరగా రిలీజ్‌పై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on October 24, 2022 10:54 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…