Movie News

దృశ్యం-2.. వెంకీ ఏం చేయబోతున్నాడు?

తెలుగులో రీమేక్‌లకు బాగా పేరుపడ్డ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అగ్ర హీరోల్లో అత్యధికంగా రీమేక్‌ల్లో నటించిన కథానాయకుడు ఆయనే కావచ్చు. రీమేక్‌లతో రాజా, సూర్యవంశం, సంక్రాంతి, దృశ్యం, గురు లాంటి మంచి విజయాలందుకున్నాడు వెంకీ. ఐతే ఇంతకుముందుతో పోలిస్తే ఈ మధ్య రీమేక్‌లు చేయడం తగ్గింది.
ఐతే ఆయన ఇప్పుడు మళ్లీ ఓ రీమేక్‌ మీద దృష్టిసారించినట్లు వార్తలొస్తున్నాయి. అదే.. దృశ్యం-2. మలయాళంలో కొన్నేళ్ల కిందట విడుదలై, అక్కడ తొలిసారి 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి చరిత్ర సినిమాగా నిలిచిన ‘దృశ్యం’ను తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగణ్, తెలుగులో వెంకీ హీరోలుగా రీమేక్ చేయగా.. అన్ని చోట్లా మంచి విజయమే అందుకుంది. ఫ్లాపుల్లో ఉన్న వెంకీకి ఈ సినిమానే ఉపశమనాన్ని అందించింది.

ఐతే ఇప్పుడు ‘దృశ్యం’కు సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు ఈ మధ్యే అధికారిక ప్రకటన వచ్చింది. హీరోగా మోహన్ లాలే నటించనుండగా.. ఒరిజినల్ తీసిన జీతు జోసెఫే దీన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది ప్రాపర్ సీక్వెల్ అని.. తొలి చిత్రం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే కథ మొదలవుతుందని.. ముగిసిందనుకున్ను కేసును మళ్లీ ఓ పోలీస్ అధికారి తిరగదోడడంతో హీరో చిక్కుల్లో పడే నేపథ్యంలో కథ నడుస్తుందని దర్శకుడు జీతు సంకేతాలు ఇచ్చాడు.

మరి మలయాళంలో ‘దృశ్యం-2’ తెరకెక్కుతోందనగానే.. ఇతర భాషల్లో దీని రీమేక్‌ల గురించి కూడా చర్చ మొదలైపోయింది. తెలుగులో వెంకీ ఈ సినిమా చేస్తాడా అన్న ప్రశ్న తలెత్తింది. ఐతే వెంకీ ఈ విషయంలో ఆసక్తిగానే ఉన్నాడని.. కానీ ఇప్పుడే దానిపై ఏ నిర్ణయం తీసుకోలేదని, ‘దృశ్యం-2’ పూర్తయి విడుదలయ్యాక దాని ఫలితాన్ని చూసి అప్పుడు నిర్ణయం తీసుకోవాలని.. చిత్ర బృందానికి రీమేక్ విషయంలో ఇప్పుడే ఓ మాట చెప్పి ఉంచుతున్నారని.. సినిమా హిట్టయితే సురేష్ ప్రొడక్షన్స్‌ వాళ్లే రీమేక్ హక్కులు తీసుకుని వెంకీతో తెరకెక్కిస్తారని సమాచారం.

This post was last modified on July 11, 2020 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

షా, బాబు భేటీలో వైఎస్ ప్రస్తావన

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…

54 minutes ago

టీడీపీపై తెలంగాణకు ఆశ చావలేదు!

అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…

2 hours ago

వైసీపీలో ఉక్కపోత ఈ రేంజిలో ఉందా?

ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…

3 hours ago

శంక‌ర్ ఆట‌లు ఇక సాగ‌వు

శంక‌ర్.. ఒక‌ప్పుడు ఈ పేరు చూసి కోట్ల‌మంది క‌ళ్లు మూసుకుని థియేట‌ర్ల‌కు వెళ్లిపోయేవారు. హీరోలు క‌థ విన‌కుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…

4 hours ago

దిల్ రాజు కోసం చరణ్ మరో సినిమా ?

యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…

12 hours ago

వాటీజ్ గోయింగ్ ఆన్?…  టీటీడీపై కేంద్రం నజర్!

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ…

12 hours ago