Movie News

సీనియర్ స్టార్లకు అగ్ని పరీక్ష

గతంలో దక్షిణాది పరిశ్రమను ఏలిన సీనియర్ స్టార్లు శరవేగంగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఒకప్పటి బాక్సాఫీస్ స్పందన రాబట్టుకోవడంలో మాత్రం తడబడుతున్నారు. ఇటీవలి పరిణామాలు దానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. దీపావళి కానుకగా ఇటీవలే విడుదలైన మోహన్ లాల్ మాన్స్టర్ కు చాలా యావరేజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ అండ్ రివ్యూస్ బాలేనప్పటికీ అసలు మొదటి ఆటకే అభిమానుల సందోహం అంతగా కనిపించలేదు. ఇది ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరిచింది. ఇదేంటి కంప్లీట్ యాక్టర్ కి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని విశ్లేషణలో పడ్డారు. పక్కన రజనీకాంత్ కు ఇతర భాషల్లో ఈ తరహా పరిస్థితే నెలకొంది.

అక్కడే కాదు మనదగ్గరా ఇలాంటి సందర్భాలు చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కు అన్నీ సానుకూలంగా వచ్చాయి. మొదటి నాలుగు రోజులు కలెక్షన్లతో థియేటర్లు కళకళలాడాయి. తీరా చూస్తే మొదటి సోమవారానికే గ్రాఫ్ అమాంతం పడిపోయింది. వీకెండ్స్ కొంత పికప్ చూపించినా ఫైనల్ గా ఆశించిన స్థాయిలో రికార్డులు అందుకోలేకపోవడం కళ్ళముందు కనిపిస్తోంది. నాగార్జున ది ఘోస్ట్ బాలేదన్నది పక్కనపెడితే ఫస్ట్ డే ఫస్ట్ షోకు పండగ రోజు పబ్లిక్ పెద్దగా కనిపించకపోవడం అక్కినేని అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఒకప్పుటి కింగ్ మార్కెట్ ఏమైందని అంతర్మథనం చెందారు.

వెంకటేష్ స్పెషల్ రోల్ చేసిన ఓరి దేవుడాకు మంచి టాక్ నడుస్తోంది. మాములుగా వెంకీ ఉన్నాడంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. ఎఫ్3కి ఈ అంశమే పని చేసింది. కానీ ఇప్పుడలా లేదు. వీకెండ్ పికప్ మీద యూనిట్ తో పాటు ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. బాలయ్య సైతం అఖండ బ్లాక్ బస్టర్ కు ముందు బ్యాడ్ ఫేజ్ ని చూసినవారే. వీళ్ళందరూ టాప్ లీగ్ కాబట్టి తట్టుకుని కొనసాగుతున్నారు కానీ సుమన్, రాజశేఖర్, శ్రీకాంత్, జగపతిబాబుల కొత్త ఇన్నింగ్స్ ఎలాంటి పాత్రలతో జరుగుతున్నాయో చూస్తున్నాం. మొత్తానికి కొత్త జనరేషన్ ని మెప్పించడంలో టాప్ మోస్ట్ సీనియర్ స్టార్లు అగ్ని పరీక్షనే ఎదురుకుంటున్నారు.

This post was last modified on October 22, 2022 7:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

1 hour ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

1 hour ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

13 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

14 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

14 hours ago