టాలీవుడ్లో ఒక దశలో నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్‌కు గట్టి పోటీదారుగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ఇక ఆమే నంబర్ వన్ అని కూడా అంతా అనుకున్నారు. ‘నాన్నకు ప్రేమతో’; ‘సరైనోడు’ లాంటి హిట్లతో నంబర్ వన్ దిశగా దూసుకెళ్లిందామె. అలాంటి హీరోయిన్ రెండు మూడేళ్లు తిరిగేసరికి టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితి రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
తెలుగులో రకుల్ మెరుపులు మెరిసి చాలా కాలం అయిపోయింది. చంద్రశేఖర్ యేలేటి-నితిన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా మినహాయిస్తే ఆమెకు ఆఫర్లు లేవు. వేరే ఇండస్ట్రీల్లో కూడా రకుల్‌కు ఆఫర్లు పెద్దగా లేనట్లే కనిపిస్తోంది. ఇంకొన్నేళ్లలో కెరీర్ ముగించి పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయినా ఆశ్చర్యం లేదేమో. ఐతే పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఏమో కానీ.. తనకు కాబోయే వరుడికి మాత్రం ఒక అర్హత కచ్చితంగా ఉండాల్సిందే అంటోంది రకుల్.
మంచి పొడగరే అయిన రకుల్.. తన కంటే ఇంకా ఎక్కువ ఎత్తున్న వాడినే చేసుకుంటానని.. తాను హై హీల్స్ వేసుకున్నా సరే.. తల ఎత్తి చూసేంత ఎత్తుగా అతనుండాలని చెప్పడం విశేషం. అలాగే ఆ వ్యక్తి చాలా తెలివైన వాడై ఉండాలని.. తాను పెళ్లి చేసుకునే సమయానికి ఏమైనా సాధించి ఉండాలని రకుల్ అభిప్రాయపడింది. ఇక మన వివాహ వ్యవస్థ మీద తనకెంతో గౌరవం ఉందన్న రకుల్.. చాలామంది పెల్లి అనగానే ఎందుకు ఒత్తిడికి గురవుతుంటారో తనకు అర్థం కాదని అంది.
పెళ్లి అనేది ఒక అందమైన అనుభూతి అన్న రకుల్.. ఎవరినైనా ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమించాలనేది తన ఉద్దేశమని చెప్పింది. ప్రస్తుతానికి తాను ఎవరి ప్రేమలోనూ లేనని.. సరైన సమయం వచ్చినపుడు పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పింది. తెలుగులో రకుల్ చివరగా అక్కినేని నాగార్జున సరసన ‘మన్మథుడు-2’లో కనిపించిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 10, 2020 1:33 pm
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…