ఈ మధ్య కాలంలో రీమేకులు చేస్తున్న నిర్మాతలకు వస్తున్న అతి పెద్ద సమస్య ఒరిజినల్ వెర్షన్లు ఓటిటిలో అందుబాటులో ఉండటం. భీమ్లా నాయక్ ప్రకటన వచ్చినప్పుడు బాష రాకపోయినా సరే సబ్ టైటిల్స్ సహాయంతో అయ్యప్పనుం కోశియుమ్ ని చూసినవాళ్లు లక్షల్లో ఉన్నారు. గాడ్ ఫాదర్ రిలీజ్ కు రెడీ అయినప్పుడు దర్శకుడు మోహన్ రాజా ఏకంగా లూసిఫర్ ని చూసి రమ్మని ఎంకరేజ్ చేశారు. ఇవన్నీ అంతో ఇంతో బజ్ మీద ప్రభావం చూపించిన అంశాలే. ఒకప్పుడంటే వీడియో టెక్నాలజీ ఈ స్థాయిలో లేదు కాబట్టి వేరే లాంగ్వేజెస్ లో హిట్ అయిన వాటిని అంత సులభంగా చూసే అవకాశం ఉండేది కాదు.
అందుకే హిందీ నిర్మాతలు ఇప్పుడో కొత్త ఎత్తుగడ ఎంచుకున్నారు. రీమేక్ నిర్మాణంలో ఉన్నప్పుడే వాటి మూలాలు ఓటిటిలో లేకుండా జాగ్రత్త పడుతున్నారు. స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టైటిల్ రోల్ పోషించిన మిలి త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇది 2019లో వచ్చిన మలయాళం సూపర్ హిట్ హెలెన్ రీమేక్. గతంలో అమెజాన్ ప్రైమ్ లో ఉండేది. హీరోయిన్ అన్నా బెన్ పెర్ఫార్మన్స్ కి వాహ్ అనని వాళ్ళు లేరు. ఇప్పుడు మిలి రిలీజ్ కు రెడీ అవుతోంది కాబట్టి దాన్ని ఓటిటి నుంచి మాయం చేసేశారు. చూడాలన్నా, పోలికలు పెట్టుకోవాలన్నా నో ఛాన్స్.
ఇదే కాదు 2014లో బెంగళూర్ డేస్ అనే మరో బ్లాక్ బస్టర్ ఉంది. ఇది హిందీలో యారియా 2 పేరుతో ఇప్పుడు తీస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఇది కూడా డిజిటల్ లో లేపేశారు. కట్ చేస్తే ఇప్పుడీ స్ట్రాటజీ చక్కగా వర్కౌట్ అయ్యేలా ఉంది. పైరసీ మార్గంలో చూసేవాళ్లను కట్టడి చేయలేం కాని వీటి మీద అవగాహన లేక కేవలం ఓటిటిలో చూసే అలవాటున్న వాళ్ళు పై రెండు సినిమాలు థియేటర్లలోనే చూడాల్సి ఉంటుంది. గతంలో కాటమరాయుడు విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యం ప్రభావం చూపించింది. ఏది ఏమైనా రీమేకులు మాత్రం ఇకపై వీలైనంత ఆలస్యం కాకుండా చూసుకోవడం బెటర్.
This post was last modified on October 21, 2022 8:57 am
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…