టాలీవుడ్ బాక్సాఫీస్ మరో ముఖ్యమైన వారాంతంలోకి అడుగు పెట్టింది. దసరా తర్వాత మళ్లీ దీపావళి ముంగిట బాక్సాఫీస్ దగ్గర సందడి నెలకొనబోతోంది. గత వారం వచ్చిన కన్నడ అనువాద చిత్రం ‘కాంతార’ చక్కటి వసూళ్లతో సాగిపోతుండగా.. ఈ వారం ఒకే రోజు ఏకంగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అందులో మూడు సినిమాలకు తమిళ కనెక్షన్ ఉండడం విశేషం.
‘ఓరి దేవుడా’ ఏమో తమిళ చిత్రం ‘ఓ మై కడవులే’ ఆధారంగా తెరకెక్కింది. ఇంకో రెండు సినిమాలు ‘సర్దార్’, ‘ప్రిన్స్’ తమిళ అనువాద చిత్రాలు. ఇక చివరిది ‘జిన్నా’ మాత్రమే స్ట్రెయిట్ తెలుగు మూవీ. ఈ నాలుగు చిత్రాల్లో ఎక్కువ బజ్ ఉన్నది ‘ఓరిదేవుడా’కే. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో సక్సెస్ అందుకున్న తర్వాత విశ్వక్సేన్ నుంచి వస్తున్న సినిమా ఇది. పైగా ప్రోమోలన్నీ ఆకర్షణీయంగా అనిపించాయి. పాటలు ఆకట్టుకున్నాయి. అన్నింటికీ మించి ఇందులో విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ చేశాడు. తమిళంలో మాదిరే తెలుగులోనూ ఈ సినిమా సక్సెస్ అవుతుందనే ధీమాతో ఉన్నారు మేకర్స్.
ఇక ‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ తీసిన సినిమా కావడంతో ‘ప్రిన్స్’పై మంచి అంచనాలే ఉన్నాయి. తమిళంలో ఈ చిత్రం భారీ స్థాయిలోనే రిలీజవుతోంది. అక్కడ శివ కార్తికేయన్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. దీన్ని ద్విభాషా చిత్రంగా పేర్కొన్నారు కానీ.. ట్రైలర్ చూస్తే తమిళంలో తీసి తెలుగులో డబ్ చేశారని అర్థమైంది. శివకు తెలుగులో ఓ మోస్తరు ఫాలోయింగ్ ఉంది. మరి ‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ ఎలాంటి మ్యాజిక్ చేశాడో చూడాలి.
మరోవైపు తెలుగు వారు అమితంగా ఇష్టపడే తమిళ హీరో కార్తి నటించిన ‘సర్దార్’ కూడా ప్రామిసింగ్‌గానే కనిపిస్తోంది. కార్తి సినిమా ఏదైనా బాగుందంటే మన వాళ్లు నెత్తిన పెట్టుకుంటారు. మరి ఈ థ్రిల్లర్ మూవీ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇక మంచు విష్ణు తనకు ‘జిన్నా’ కమ్ బ్యాక్ మూవీ అవుతుందని ధీమాగా ఉన్నాడు. అతడికి కలిసొచ్చిన కామెడీ ఎంటర్టైనర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కింది. మరి ఈ నాలుగు చిత్రాలు దీపావళి సందర్భంగా తారా జువ్వల్లా పైకెగిరేవి ఏవో.. తుస్సుమనిపించేవి ఏవో చూడాలి.
This post was last modified on October 21, 2022 8:42 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…