ఏడాది నుండి ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు విష్ణు మంచు. మా ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా పోటీ చేయడంతో విష్ణు ఒక్కసారిగా లైంలైట్ లోకి వచ్చాడు. అక్కడి ఇప్పటి వరకూ విష్ణు మీద మీడియా ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతూ వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విష్ణుని ఇప్పటికీ ఏదో రకంగా ట్రోల్స్ చేస్తూ ఉంటున్నారు కొందరు. అయితే విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాక రిలీజవుతున్న సినిమా ‘జిన్నా’. మా ఎన్నికలు వాటి ద్వారా వచ్చిన గొడవలు తర్వాత ఇప్పుడు హీరోగా జిన్నా తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు విష్ణు.
అయితే ఈ సినిమా విజయం విష్ణు కి చాలా కీలకం. మా ప్రెసిడెంట్ గా గర్వపడుతున్న తరుణంలో విష్ణు కి సినిమా సక్సెస్ కూడా చాలా ముఖ్యమనే చెప్పాలి. సక్సెస్ ఉంటేనే ఎక్కడైనా గౌరవం దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో అది చూస్తూనే ఉన్నాం. మా ప్రెసిడెంట్ గా ఉన్న విష్ణు ఇప్పుడు జిన్నా తో హీరోగా కూడా సక్సెస్ అందుకుంటే ఇక విష్ణు ఆపే వారే ఉండరు.
జిన్నా విషయంలో విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఇస్తున్న ఇంటర్వ్యూలో సూపర్ హిట్ పక్కా అంటున్నాడు. అలాగే డీ సినిమాకి మించి ఉంటుందని హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఆ సినిమాను మించి ఉండకపోయినా అట్లీస్ట్ మ్యాచ్ చేసిన విష్ణు నిర్మాతగా మంచి వసూళ్ళు అందుకోవచ్చు. కానీ జిన్నా విషయంలో ఆడియన్స్ కు కొన్ని సందేహాలు ఉన్నాయి.
ఈ సినిమాకు జీ. నాగేశ్వరరావు కథ అందించారు. దర్శకుడిగా ఆయన సక్సెస్ లో లేరు. ఇప్పటి వరకూ ఆయన కథలేవి పెద్దగా సౌండ్ చేయలేదు. పైగా దీనికి కొత్త దర్శకుడు. అతను ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడా ? అనేది కూడా సందేహంగానే ఉంది. ఇక కోనా వెంకట్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించాడు మరి రైటర్ గా ఆయన సినిమాకు ఎంత వరకూ ప్లస్ అవుతాడో చూడాలి. ఏదేమైనా విష్ణు మంచు కి జిన్నా విజయం చాలా కీలకం.
This post was last modified on October 20, 2022 11:15 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…