‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ చిత్రాల తర్వాత దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సీక్వెల్ అంటే ‘పుష్ప-2’నే. గత ఏడాది డివైడ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా అంచనాలను మించి ఆడేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అవతల.. అందులోనూ ఉత్తరాదిన ఈ సినిమాకు వచ్చిన స్పందన అనూహ్యం. అక్కడ చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అయిపోయి.. ఒక యుఫోరియా సృష్టించింది ‘పుష్ప’. ఈ సినిమాలో బన్నీ తగ్గేదేలే మేనరిజం అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయింది. దీని వల్ల కూడా సీక్వెల్‌కు ఇంకా క్రేజ్ పెరిగింది.
ఐతే ఈ అంచనాలు పెరగడం వల్ల సుకుమార్ మరింత జాగ్రత్త పడుతున్నాడు. ముందు అనుకున్న స్క్రిప్టును మార్చి ఇంకా పకడ్బందీగా తయారు చేసే క్రమంలో బాగా టైం తీసుకుంటున్నాడు. ఫస్ట్ పార్ట్ వచ్చి పది నెలలు దాటినా ఈ చిత్రం ఇంకా సెట్స్ మీదికి వెళ్లని సంగతి తెలిసిందే. ఈ నెల చివరి వారంలో షూటింగ్ ప్రారంభం కావచ్చని అంటున్నారు.
ఐతే షూటింగ్ మొదలవడానికి ముందే బన్నీ లుక్ టెస్ట్ జరిగింది. అన్నపూర్ణ స్టూడియలో రెండు దశలుగా కొన్ని రోజుల పాటు ఈ షూట్ నడిచింది. ఈ సందర్భంగా లుక్ ఒకటి సెట్ చేసి రకరకాల గెటప్పుల్లో టెస్ట షూట్ చేశారు. అందులో ఒక స్టన్నింగ్ గెటప్ ఉందని, అది సినిమాలో కీలక ఎపిసోడ్‌కు సంబంధించినదని సమాచారం. ముందు ఆ గెటప్‌ను సర్ప్రైజ్ లాగా దాచి పెట్టాలని అనుకున్నప్పటికీ.. దాన్నే ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేయాలని సుకుమార్ ఫిక్సయ్యాడట.
దీపావళికి ‘పుష్ప-2’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ‘పుష్ప’ సినిమాకు కూడా ఇలాగే టెస్ట్ షూట్ చేసి, షూటింగ్ మొదలవడానికి ముందే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ లుక్‌తోటే సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ అంచనాలు ఎక్కువే ఉండగా.. వాటిని ఇంకా పీక్స్‌కు తీసుకెళ్లేలా సంచలన లుక్‌ను సుకుమార్ రెడీ చేసినట్లు చెబుతున్నారు.
This post was last modified on October 17, 2022 2:54 pm
కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా కంగువ మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సూర్యకి అది కోలీవుడ్…
మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా..…
ఏపీలో తాజాగా జపాన్‌లో టాయామా ప్రిఫెడ్జర్ ప్రావిన్స్ గవర్నర్ సహా 14 మంది ప్రత్యేక అధికారులు.. అక్కడి అధికార పార్టీ…
రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా…
సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ .. సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.…