Movie News

కాంతారాలో రంగస్థలం లింకు

అదేంటి ఎప్పుడో వచ్చిన రంగస్థలంతో లేటెస్ట్ కన్నడ హిట్ మూవీకి లింక్ ఏమిటనుకుంటున్నారా. తాజాగా కాంతారా సృష్టిస్తున్న సంచలనం చూసి మెగా ఫ్యాన్స్ ఇదే ఫీలవుతున్నారు. ఎందుకంటే ఇందులో మెయిన్ స్టోరీ లైన్ చరణ్ సినిమాకు దగ్గరగా ఉండటం వల్లే. అన్న కుమార్ బాబుని ప్రెసిడెంట్ చంపేస్తే మొదట్లో గుర్తించని చిట్టిబాటు తర్వాత నిజం తెలుసుకుని అతన్ని మట్టుబెట్టడం సుకుమార్ అద్భుతంగా చూపించారు. కట్ చేస్తే ఇప్పుడీ కాంతారాలో రివర్స్ లో ఉంటుంది. తమ్ముడిని దొర హత్య చేస్తే ముందు పసిగట్టని హీరో చివర్లో దేవుడి వేషంలో ఉగ్రరూపం ధరించి మట్టికరిపిస్తాడు.

బ్యాక్ డ్రాప్, క్యారెక్టరైజేషన్ల పరంగా ఎలాంటి పోలిక లేకపోయినా ఎమోషన్ కు సంబంధించిన కీలక పాయింట్ మాత్రం దగ్గరగా ఉన్న మాట వాస్తవం. నిజానికి రంగస్థలం కూడా రా విలేజ్ డ్రామా. కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ 1985 నాటి పరిస్థితులను చాలా సహజంగా చిత్రీకరించిన తీరు దాన్ని ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చేసింది. రామ్ చరణ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని మాస్ కోసం ఐటెం సాంగ్ లాంటివి పెట్టారు కానీ ఓవరాల్ గా చూస్తే నిజాయితీతో కూడిన ప్రయత్నం అందులో కనిపిస్తుంది. అందుకే క్లాసు మాసు తేడా లేకుండా అందరూ ఆ చిత్రాన్ని ఆదరించారు.

కాకపోతే రంగస్థలం అప్పట్లో తెలుగుకే పరిమితం అయ్యింది. ప్యాన్ ఇండియా ట్రెండ్ ఆ టైంలో లేకపోవడంతో నిర్మాతలు ఇతర భాషల్లో డబ్బింగ్ గురించి ఆలోచించలేదు. కన్నడలో సైతం చాలా ఆలస్యంగా అనువదించారు. ఒకవేళ ఇదే సినిమా హిందీలోనూ వచ్చి ఉంటే ఆర్ఆర్ఆర్ కన్నా ముందే ఎక్కువ గుర్తింపు చరణ్ కు వచ్చేదని అభిమానుల అభిప్రాయం. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ మారిన పరిస్థితులను కాంతారాలాంటివి క్యాష్ చేసుకుంటున్నాయి. మనదగ్గరా అంతకు మించిన కల్ట్స్ తీసే సత్తా ఉన్న దర్శకులు కాబట్టి ఇకనైనా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

This post was last modified on October 17, 2022 12:23 am

Share

Recent Posts

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

5 minutes ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

14 minutes ago

40 సంవత్సరాల రాక్షసుడు…..ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

15 minutes ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

3 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

3 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

4 hours ago