సలార్ కు సరైన విలనే దొరికాడు

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ లో విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్ అఫీషియల్ గా లాక్ అయ్యాడు. ఆ మధ్య తన డబ్బింగ్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఇందులో మీరు ఉంటారా లేదా అనే మీడియా ప్రశ్నకు నర్మగర్భంగా సమాధానం ఇచ్చిన పృథ్విరాజ్ సరైన సమయంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో తన పాత్ర పేరు వరదరాజ మన్నార్. నీల్ రెగ్యులర్ స్టైల్ లో మసిపూసిన బట్టలు, మొహం, గెటప్ తో ఈ విలక్షణ నటుడు భయపెట్టే లుక్స్ తో ఉన్నాడు. మెయిన్ విలన్ ఇతననే మెసేజ్ ఇచ్చినట్టే.

ప్రతినాయకుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ కోసం సంజయ్ దత్ ని సెట్ చేసుకుని ఎంత అడ్వాంటేజ్ వాడుకున్నాడో చూశాం. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఈ ఫ్యాక్టర్ బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ సలార్ కోసం పృథ్విరాజ్ ని పెట్టుకోవడం ద్వారా కేరళ మార్కెట్ ని ఇంకాస్త బలంగా టార్గెట్ చేసినట్టు అయ్యింది. ఎందుకంటే ఇతను మల్లువుడ్ లో మాములు స్టార్ కాదు. మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత ఆ స్థాయి బిజినెస్ చేయగలిగిన రేంజ్ ఇతనిది. అలాంటి నటుడు ఏరికోరి మరీ ప్రభాస్ కి ఎదురు నిలబడే క్యారెక్టర్ చేస్తే బజ్ డబుల్ కాక ఇంకేమవుతుంది.

ఇలా సరైన విలన్ కరెక్ట్ గా కుదిరితే ప్రభాస్ మూవీస్ ఏ స్థాయిలో అరాచకం చేస్తాయో బాహుబలిలో రానా, కెజిఎఫ్ 1లో గరుడ రామ్ లు నిరూపించారు. ఈ థ్రెడ్ వీక్ గా ఉండటం వల్లే సాహో, రాధే శ్యామ్ లు వీక్ అయిపోయి మాస్ కి కనెక్ట్ కాలేదు. కానీ ప్రశాంత్ నీల్ అలాంటి పొరపాటు చేయలేదు. విడుదలకు ఇంకా ఏడాది టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే దీని మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆది పురుష్ యానిమేషన్ మిక్స్ చేసిన సినిమా కాబట్టి అది ఏ స్థాయిలో విజయం సాధించినా సలార్ మీదే వాళ్ళ కళ్లన్నీ. శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే