కాంతార.. కాంతార.. కాంతార.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కన్నడ చిత్రం గురించే చర్చ. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళె ఫిలిమ్స్.. రూ.18 కోట్ల పరిమిత బడ్జెట్లో తీసిన మిడ్ రేంజ్ మూవీ ఇది. కిరిక్ పార్టీ సహా కొన్ని హిట్ సినిమాలు తీసిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తనే లీడ్ రోల్ చేస్తూ ఈ సినిమాను రూపొందించాడు.
సెప్టెంబరు 30న కన్నడ నాట ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ముందు కర్ణాటకలో ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత హైదరాబాద్, ముంబయి, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లోని మేజర్ సిటీల్లో జనం ఈ సినిమా కోసం ఎగబడ్డారు. ఒక రోజు ముందు బుక్ చేసుకుంటే తప్ప టికెట్లు దొరకనంత డిమాండ్ కనిపించింది సినిమాకు. కన్నడ వెర్షన్ చూడడానికి ఇతర భాషల వాళ్లు అలా ఎగబడ్డం చూసి ఆయా భాషల్లో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టేశారు నిర్మాతలు.
తెలుగులో శనివారమే ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా విడుదలైంది. తమిళంలో కూడా ఇదే రోజు సినిమాను రిలీజ్ చేశారు. మలయాళంలో వచ్చే వారం ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి ఈవెంట్ ఫిలిమ్స్, అందునా అదిరిపోయే టాక్ తెచ్చుకున్న సినిమాలు వస్తే వదిలిపెడతారా? ఈ వారం రిలీజైన తెలుగు సినిమాలను అస్సలు పట్టించుకోకుండా, గత వారం నుంచి నడుస్తున్న గాడ్ ఫాదర్ మూవీని కూడా పక్కన పెట్టేసి ‘కాంతార’ మీద పడిపోయారు.
అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూసే అందరూ ఆశ్చర్యపోగా.. శనివారం అన్ని చోట్లా మార్నింగ్ షోలకు మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. సినిమాకు టాక్ కూడా చాలా బాగుండడం.. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులో 8.45 షో పూర్తయ్యాక ప్రెస్ వాళ్లతో పాటు మామూలు జనాలు కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారన్న సమాచారం రావడంతో జనాలకు సినిమా మీద ఇంకా ఆసక్తి పెరిగిపోతోంది. ఈ టాక్, హైప్ చూస్తుంటే తెలుగులో కాంతార వసూళ్లు కుమ్మేయబోతోందన్నది స్పష్టం.
This post was last modified on October 15, 2022 8:46 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…